Preity Zinta : మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తా అంటున్న ప్రీతి జింటా..
ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రీతి జింటా ఐపీఎల్ పంజాబ్ టీమ్ ఫ్రాంచైజీ ఓనర్ గా బిజీగా ఉంది.

Preity Zinta wants to re entry in Telugu Movies
Preity Zinta : ప్రీతి జింటా.. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలు చేసి బోలెడంత ఫ్యాన్ డమ్ కూడా తెచ్చుకుంది తెలుగులో. ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో తన క్యూట్ నెస్ తో, నటనతో మెప్పించింది. అయితే ఆ రెండు సినిమాల తర్వాత మళ్ళీ తెలుగులో సినిమాలు చేయలేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి 2018 నుంచి బ్రేక్ తీసుకుంది.
ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రీతి జింటా ఐపీఎల్ పంజాబ్ టీమ్ ఫ్రాంచైజీ ఓనర్ గా బిజీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. 50 ఏళ్ళు దగ్గర పడుతున్నా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో, నెటిజన్లతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది ప్రీతి జింటా.
Also Read : Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో నాలో ఏ ఛేంజ్ రాలేదు.. పాన్ ఇండియా యాక్టర్ అనేది నేను నమ్మను..
ఈ క్రమంలో ఓ నెటిజన్.. మీరు తెలుగు సినిమాల్లో మళ్ళీ నటిస్తారా అని అడగ్గా ప్రీతి జింటా సమాధానమిస్తూ.. నేను అసలు చేయను అని ఎప్పుడూ చెప్పలేదు. మంచి కథ వినిపిస్తే నేను నో చెప్పకుండా చేస్తాను అని తెలిపింది. ఇప్పుడే బాలీవుడ్ లో ఆరేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రీతి జింటా మరి తెలుగులో కూడా స్పెషల్ క్యారెక్టర్ రోల్స్ తో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. తనే డైరెక్ట్ గా మంచి స్క్రిప్ట్స్ వస్తే చేస్తాను అని చెప్పడంతో తెలుగు దర్శక నిర్మాతలు ఎవరైనా ప్రీతి జింటాని తెలుగులో రీ ఇంట్రీ ఇప్పిస్తారేమో ఎదురుచూడాలి.
Never say never ❤️ who knows if I hear an amazing script I cannot say no to… https://t.co/z0P4RH1g5y
— Preity G Zinta (@realpreityzinta) May 6, 2024