కరోనాతో సంబంధం లేదు.. 600% పెరిగిన క్రూయిజ్ షిప్‌ల బుకింగ్‌లు

  • Published By: Subhan ,Published On : May 12, 2020 / 08:57 AM IST
కరోనాతో సంబంధం లేదు.. 600% పెరిగిన క్రూయిజ్ షిప్‌ల బుకింగ్‌లు

సంవత్సరారంభం నుంచి పట్టిపీడిస్తున్న COVID-19ఆర్థికంగా ప్రపంచ దేశాలన్నింటినీ ముంచేసింది. క్రూయిష్ షిప్‌ల పైనా ఈ ప్రభావం కనిపించింది. దానికి కారణం సముద్ర ప్రాంతమైన జపాన్ లోని యొకోహోమాలో క్రూయిజ్ ఇరుక్కుపోవడమే. అందులో పాజిటివ్‌గా నమోదైన కరోనా ఇతర ప్రయాణికులకు వ్యాప్తి చెందడమే. దీంతో మహమ్మారి ప్రభావానికి క్రూయిజ్ షిప్ లు సైతం భారీ పతనాన్ని చవిచూశాయి. 

ఇదిలా ఉంటే ఉన్నట్టుండీ ఆగష్టులో ప్రయాణించేందుకు కరోనా క్రూయిజ్ షిప్ బుకింగ్‌లు అమాంతం పెరిగిపోయాయి. సముద్రంలోకి వెళ్లిన క్రూయిజ్ షిప్ లు ఆగష్టులో తిరిగిరానున్నాయని తెలియడంతో 600శాతం అధికంగా కొనుగోళ్లు జరిగాయట. ఆగష్టు 2019 బుకింగ్స్ తో పోలిస్తే 200శాతం పెరిగాయని అంటున్నారు. షిప్ లలో ఎక్కి ప్రాణాలు కోల్పోతామేమోననే భయం ఎవ్వరిలోనూ కనిపించడం లేదని అంటున్నారు. 

ఈ ధరలు పెరగడానికి ముఖ్య కారణం.. యూత్, ఆరోగ్య వంతులైన వారు ఈ సారి ప్రయాణానికి ఆసక్తి చూపిస్తుండటమే. లాక్‌డౌన్‌లో బయట తిరగాలనే ఆసక్తి ఉండటమే ధరలు పెరగడానికి కారణం. మరి మీరు కూడా కార్నివాల్ బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నారు. ధర కేవలం 28డాలర్లు మాత్రమే. 

Read Here>> ఆస్పత్రి వెంటిలేటర్‌లో మంటలు..ఐదుగురు కరోనా రోగులు మృతి