ప్రియురాలిని పరిచయం చేసిన రానా!

టాలీవుడ్ హీరో దగ్గుబాటి నట వారసుడు రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేమాయణంపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ.. సోషల్‌మీడియా ద్వారా తను వివాహం చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేశాడు రానా.
తన ప్రేమను మిహికా బజాజ్ అంగీకరించిందని చెప్పిన రానా.. ఈ సందర్భంగా తన ప్రేయసితో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ముందున్న రానా దగ్గుబాటి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడించాడు.
తన ప్రియురాలు ఫోటోను ట్విట్టర్ లో ఫోస్ట్ చేసిన రానాకు సెటబ్రిటీల నుంచి అభిమానుల వరకు అభినందనలు తెలుపుతున్నారు. తను డ్యూ డ్రాప్ డిజైన్ అనే ఈవెంట్ కంపెనీని రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
And she said Yes 🙂 ❤️ pic.twitter.com/iu1GZxhTeN
— Rana Daggubati (@RanaDaggubati) May 12, 2020
Read Here>> బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన సినీ నటి