113 ఏళ్ల మహిళ ధైర్యానికి 4 వారాల్లో కరోనా వైరస్‌ ఖతం

  • Published By: Subhan ,Published On : May 13, 2020 / 03:32 AM IST
113 ఏళ్ల మహిళ ధైర్యానికి 4 వారాల్లో కరోనా వైరస్‌ ఖతం

80ఏళ్లు దాటితేనే కరోనాను ఎదుర్కొనడం కష్టమని వైద్యులు చెప్తున్నప్పటికీ 113 ఏళ్ల మహిళ ఇంట్లోనే ఐసోలేషన్ పాటిస్తూ కరోనాను తరిమికొట్టింది. స్పెయిన్ లోని పొరిగింటి వారు ఆమెకు కరోనా సోకిందని భయపడుతుంటే 4వారాల పాటు ఐసోలేషన్ పాటించి మంగళవారం టెస్టుతో నెగెటివ్ గా బయటికొచ్చింది. 

అమెరికాలో పుట్టిన మారియా బ్రాన్యాస్ శాంతా మారియా దెడ్ తురా కేర్ హోమ్‌లో ఇన్ఫెక్షన్‌కు గురైంది. అక్కడే ఆమె 20 సంవత్సరాలుగా ఉంటుంది. శ్వాస సంబంధిత సమస్యలు ఉండటంతో ఇంట్లోనే ఐసోలేషన్ పాటించింది. ‘జబ్బుతో బాధపడింది కానీ ఇప్పుడు కోలుకుందని’ స్థానికులు చెబుతున్నారు. 

ఆమె ఇప్పుడు బాగానే ఉంది. గత వారం ఆమెకు టెస్టు నిర్వహించాం. రిజల్ట్ నెగెటివ్ వచ్చింది. ముగ్గురికి తల్లి అయిన బ్రన్యాస్.. 4వారాల పాటు ఐసోలేషన్ లో ఉండిపోయింది. కేవలం ఒక్క ఉద్యోగి మాత్రమే ఆమెను చెక్ చేస్తూ ఉన్నారని స్థానిక మీడియా చెప్తుంది. 

ఆ వీడియోలో బ్రన్యాస్ స్టాఫ్ ను చాలా మర్యాదగా పిలుస్తున్నట్లుగా వినిపిస్తుంది. ఆమె అంతకాలం బతకడానికి సీక్రెట్ ఏంటని అడిగిన ప్రశ్నకు ఒకే సమధానం చెప్తుంది. చక్కటి ఆరోగ్యంతో బతకడానికి తాను అదృష్టవంతురాలినని చెప్పింది. ఆ కేర్ హోమ్ లో పలువురు వైరస్ కు గురై ప్రాణాలు కోల్పోయారు. 

స్పానిష్ మీడియా ఆమెను ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధురాలిగా గుర్తించాలంటూ మీడయా కథనాలు ప్రచురించాయి. 1907 మార్చి 4న శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆమె పుట్టింది. జర్నలిస్టుగా పనిచేసిన ఆమె వరల్డ్ వార్ 1 సమయంలో పడవలో స్పెయిన్ కు వెళ్లిపోయింది. స్పానిష్ ఫ్లూ మహమ్మారి 1918-19 సమయంలోననూ అక్కడే ఉంది. స్పెయిన్ సివిల్ వార్ జరిగిన 1936-39 టైంలోనూ అక్కడే ఉంది. మహమ్మారి ధాటికి నష్టపోయిన దేశాలలో స్పెయిన్ ఒకటి. 27వేల COVID-19 మృతులు సంభవించాయి

Read More:

ఆస్పత్రి వెంటిలేటర్‌లో మంటలు..ఐదుగురు కరోనా రోగులు మృతి

కరోనాతో సంబంధం లేదు.. 600% పెరిగిన క్రూయిజ్ షిప్‌ల బుకింగ్‌లు