కారు బాంబుతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్థాన్..

  • Published By: nagamani ,Published On : May 18, 2020 / 09:03 AM IST
కారు బాంబుతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్థాన్..

నిత్యం బాంబు దాడులతో దద్దరిల్లే ఆఫ్ఘనిస్తాన్ లో మారోసారి పేలుళ్లతో మారుమ్రోగిపోయింది. ఘంజి సిటీలో జ‌రిగిన కారు బాంబు పేలటంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 32మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఆఫ్ఘ‌నిస్తాన్ ఇంటెలిజెన్స్‌ను టార్గెట్ చేస్తూ దాడికి పాల్ప‌డినట్లుగా తెలుస్తోంది. నేష‌న‌ల్ డైర‌క్ట‌రేట్ సెక్యూర్టీ యూనిట్‌ను ఉగ్ర‌వాదులు టార్గెట్ చేసిన‌ట్లు రాజభవన్ ప్రతినిథి వహీదుల్లా జుమాజాడా తెలిపారు.  బాధితులంతా ఇంటెలిజెన్స్ ఉద్యోగులే అని తేలింది.

కేంద్ర హోంశాఖ మంత్రి ఈ దాడిని ద్రువీక‌రించారు. దాడికి బాధ్య‌త వ‌హిస్తూ ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా వెలువడలేదని ఎవ‌రూ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. తాలిబ‌న్‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న క్రమంలో ఇటువంటి దాడి జరగటం విచారించదగిన విషయం. కాగా ఇస్లామిక్ దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లు బాంబు పేలుళ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. 

Read : ఆ 161 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపేస్తోంది!