Harvesting Chillies : మిర్చి కోతల సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు !

కాయలు ఎండబెట్టే ప్రాంతానికి కుక్కలు, పిల్లులు, కోళ్ళు, ఎలుకలు, పందికొక్కులు. రాకుండా చూసుకోవాలి. తాలు కాయలను, మచ్చకాయలను గ్రేడింగ్‌ చేసి వేరు చేయాలి. నిల్వ చేయడానికి తేమలేని శుభ్రమైన గొనే సంచుల్లో కాయలు నింపాలి. తేమ తగలకుండా వరిపొట్టు లేదా చెక్కబల్లలమీద గోడలకు దూరంలో నిల్వఉంచాలి.

Harvesting Chillies : మిర్చి కోతల సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు !

Precautions to be taken while harvesting chillies!

Harvesting Chillies : మిరప పంటను సాగు చేసే రైతులు కోతల సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. పంట దిగుబడి, నాణ్యత పెంచటానికి చెట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడుకోసి ఆరపెట్టుకోవాలి. కాయలు ఆరబెట్టుకునేందుకు పట్టాలు కాని, సిమెంట్ ఫ్లోర్ పైన కానీ ఆరబెట్టాలి. నేరుగా మట్టి నేలపై ఆరబెట్టరాదు. చెట్టుపైనే మిరపకాయలను పూర్తిగా పండనీయకుండా చూసుకోవాలి. పూర్తిగా పండితే నాణ్యత తగ్గుతుంది.

కాయలు కోసేముందు సస్యరక్షణ మందులు పిచికారీ చేయకూడదు. ఆప్తోటాక్సిన్‌ వృద్ధికాకుండా మిరపకాయలను పాలిథీన్‌ పట్టాలమీద లేదా సిమెంట్‌ గచ్చుమీద ఎండబెట్టాలి. రాత్రి సమయంలో మంచుబారిన పదకుందా కాయలను కప్పిఉంచాలి. మిరపలో. 10 శాతానికి మించి ఎక్కువ తేమ ఉండకుండా చూడాలి. ఎండ బెట్టే సమయంలో చెత్త, దుమ్ము ధూళి లేకుండా కాయలను శుభ్రంగా ఉండేటట్లు చేయాలి.

కాయలు ఎండబెట్టే ప్రాంతానికి కుక్కలు, పిల్లులు, కోళ్ళు, ఎలుకలు, పందికొక్కులు. రాకుండా చూసుకోవాలి. తాలు కాయలను, మచ్చకాయలను గ్రేడింగ్‌ చేసి వేరు చేయాలి. నిల్వ చేయడానికి తేమలేని శుభ్రమైన గొనే సంచుల్లో కాయలు నింపాలి. తేమ తగలకుండా వరిపొట్టు లేదా చెక్కబల్లలమీద గోడలకు దూరంలో నిల్వఉంచాలి. అవసరమైతే శీతల గిడ్దంగుల్లో నిల్వచేస్తే రంగు, నాణ్యత తగ్గకుండా లాభదాయకంగా ఉంటుంది.

కాయలు నిగనిగలాడుతూ మంచి రంగు ఉండాలని రసాయనాలను, రంగులను వాడకూడదు. అకాల వర్షాలకు గురికాకుండా, మంచుబారిన పడకుండా రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్లలో గానీ లేదా టోబాకోటారెన్‌లో గానీ, ఎండబెట్టి నాణ్యమైన మిరప కాయలను పొదాలి.