Beera Cultivation : బీరసాగులో అనువైన రకాల ఎంపిక !

తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పెరియాకుళం నుండి విడుదలయిన రకం, కాయలు 60-70 సెం.మీ. పొడవుతో, కాయ చివర వెడల్పుగాను, తొడిమ భాగం సన్నగాను ఉంటుంది. పంటకాలం: 130 రోజులు దిగుబడి : 7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.

Beera Cultivation : బీరసాగులో అనువైన రకాల ఎంపిక !

Selection of suitable varieties in beer cultivation!

Beera Cultivation : తీగజాతి కూరగాయ పంటలలో బీర ఒక ముఖ్యమైన పంట. సరాసరి దిగుబడి ఎకరానికి 6టన్నులు వస్తుంది. తేమతో కూడిన వేడి వాతావరణం వీటి సాగుకు అనుకూలము. ఉష్ణోగ్రత 25-30 సెం.ఉంటే తీగ పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది. తీగ మొదటి పెరుగుదల దశలో వేడి ఎక్కువగా ఉంటే మగపూలు ఎక్కువగా వస్తాయి. నీటిని నిలువుకునే తేలికపాటి ఎర్ర గరప మరియు బంకమట్టి నేలలు, ఉదజని సూచిక 6.0-7.0 మధ్య ఉన్న నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల ఒండ్రు నేలలు అనుకూలం.

సాగుకు అనువైన రకాలు ;

జగిత్యాల లాంగ్‌: ఇది తెలంగాణాలోని కరీంనగర్‌ జిల్లాకు చెందిన దేశవాలీ రకం. కాయలు 50-60 సెం.మీ. పొడవుతో సన్నగా లోతైన కణుపులు కలిగి ఉంటాయి. ఖరీఫ్‌లో అధిక దిగుబడినిస్తుంది. వేసవిలోని అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు.

కో-1 : ఇది తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబత్తూరు నుండి విడుదలయిన రకం. తీగ పెరుగుదల మధ్యస్థంగా ఉంటుంది. కాయలు 40-50 సెం.మీ. పొడవుండి, కాయమీద కణుపులు ఎత్తుగా ఉంటాయి. కాయ పూత చివర భాగం వెడల్పుగాను, కాయ తొడిమ భాగం సన్నగా ఉంటుంది. ఒక్కో కాయ 800 గ్రా. తూగుతుంది. పంటకాలం 125 రోజులు, దిగుబడి 5.6 టన్నులు ఎకరానికి వస్తుంది.

కో-2 : ఇది కూడా తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబత్తూరు నుండి విడుదలయిన రకం. ఈ రకం కాయలు చాలా పొడవుగా ఉంటాయి. 90-100 సెం.మీ. వరకు ఉంటాయి. గింజలు కో-1లో కంటే తక్కువగా ఉంటాయి. ఒక్కో కాయ 700-800 గ్రా. బరువుంటుంది. పంటకాలం : 120 రోజులు, దిగుబడి 10 టన్నులు ఎకరానికి దిగుబడి వస్తుంది.

అర్మ సుజాత: ఇది త్వరగా కాపుకు వచ్చే ఐ.ఐ. హెచ్‌.ఆర్‌. – 54, పొడవు రకం, ఐ.ఐ. హెచ్‌.ఆర్‌.-18 లను సంకర పరచి రూపొందించబడింది. మొదటి కాయ 13-15 కణుపుకు వస్తుంది. కాయ 50-55 సెం.మీ. పొడవుంటుంది. పంటకాలం : 100 రోజులు. దిగుబడి; 21టన్నులు వస్తుంది. ఈ రకం కొంత వరకు బూజు తెగులను తట్టుకుంటుంది.

పి.క.యం-1 : తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పెరియాకుళం నుండి విడుదలయిన రకం, కాయలు 60-70 సెం.మీ. పొడవుతో, కాయ చివర వెడల్పుగాను, తొడిమ భాగం సన్నగాను ఉంటుంది. పంటకాలం: 130 రోజులు దిగుబడి : 7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.

పూసానన్‌దర్‌: ఇది మధ్యప్రదేశ్‌ నుండి ఎన్నిక చేసిన రకం, భారతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, న్యూఢిల్లీ నుండి రూపొందంచబడింది. త్వరగా కాపుకు వస్తుంది. 60-65 రోజులలో ఒక్కో తీగకు 15-20 కాయలు కాస్తాయి. కాయలు లేత ఆకుపచ్చ రంగులోను, లోపలి గుజ్జు లేత పసుపు రంగులోను ఉంటుంది. ఈ రకం ఖరీఫ్‌కు, వేసవికి అనుకూలం. దిగుబడి : 6-7 టన్నులు ఎకరానికి వస్తుంది.

సత్‌పుతియ : ఇది బీహారు రకం. ఈ రకంలో ద్విలింగ పుష్పాలుంటాయి. కాయలు గుత్తులుగా, చిన్నవిగా కాస్తాయి. ఖరీఫ్‌, వేసవి కాలానికి అనువైనది.

అర్మ సుమీత్‌: ఇది భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ, బెంగుళూరు నుండి విడుదలయిన రకం. తీగ పెరుగుదల మధ్యస్థంగా ఉంటుంది. 15వ కణుపుకు కాయ కాస్తుంది. కాయలు 25 సెం.మీ. మందం, 55 సెం.మీ. పొడవుతో ఉంటాయి. 52 రోజులలో మొదటి కోతకు వస్తుంది. ఒక్కో తీగకు 13-15 కాయలు వస్తాయి. ఒక్కో కాయ 380గ్రా. బరువుంటుంది. పంటకాలం : 120 రోజులు, దిగుబడి : 21 టన్నుల దిగుబడి నిస్తుంది.

ఇవికాక వివిధ (ప్రైవేట్‌ హైబ్రిడ్‌ రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సురేఖా, సంజీవని, ఎన్‌.ఎస్‌.-౩,ఎన్‌.ఎస్‌.-401, ఎన్‌.ఎస్‌.-403, మహిమ రకాలు వేసవికి కూడ అనువైన హైబ్రిడ్‌ రకాలు.