Tulsi Cultivation : వాణిజ్య సరళిలో తులసి పంటసాగు పద్దతి!

14 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంగ్రే వాతావరణంలో ఇది బాగా పెరుగుతుంది. మంచుపడి వాతావరణం అనుకూలం కాదు. ఇది విత్తనాల ద్వారా ప్రవర్ధనము చేందుతుంది. ఎకరానికి 200 గ్రాముల విత్తనం అవసరమౌతుంది. విత్తనానికి 8 రెట్ల ఇసుకతో కలిపి తయారు చేసుకొన్న నారుముళ్లలో ఏప్రిల్, మే నెలలో చల్లుకొని నారు పెంచుకోవాలి.

Tulsi Cultivation : వాణిజ్య సరళిలో తులసి పంటసాగు పద్దతి!

Tulsi Cultivation : తులసి ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్న మొక్క. దీనితో సుగంధ తైలం తయారు చేస్తారు. వాతవరణ కాలుష్యాన్ని పోగట్టి పరిసరాలను శుభ్రపరుస్తుంది. తులసి తైలముతో డెంటల్ క్రీములు, టూత్ పేస్టులు తయారుచేస్తారు. తులసి తైలాన్ని స్ప్రేలలో, పన్నీరులో, స్వీట్లలో వాడుతారు. తులసికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉండటంతో చాలా మంది రైతులు దీని సాగు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియాలోనేకాక థాయిలాండు, గ్వాటిమాలా, కొన్ని ఆఫ్రికా దేశాలలో తులసి వాణిజ్య సరళిలో సాగవుతుంది. మనదేశంలో ఉత్తరప్రదేశ్ లోని రాంపుర, చందౌసీ, కనేజ్, లక్నో, తదితర ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తున్నారు. అన్ని రకములైన భూములలోని ఇది ప్రకృతి సిద్ధంగానే సాగు చేయవచ్చు. నీరునిలిచే ప్రదేశాలు పనికిరావు. పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలలో సాగుకు అనుకూలమైన పంట.

14 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంగ్రే వాతావరణంలో ఇది బాగా పెరుగుతుంది. మంచుపడి వాతావరణం అనుకూలం కాదు. ఇది విత్తనాల ద్వారా ప్రవర్ధనము చేందుతుంది. ఎకరానికి 200 గ్రాముల విత్తనం అవసరమౌతుంది. విత్తనానికి 8 రెట్ల ఇసుకతో కలిపి తయారు చేసుకొన్న నారుముళ్లలో ఏప్రిల్, మే నెలలో చల్లుకొని నారు పెంచుకోవాలి. ఒక నెలలో నారు నాటుకువస్తుంది. 8నుండి13 రోజులలో మొత్తం విత్తనం మొలకెత్తుతుంది. పంట ఆరోగ్యం కోసం చిలికిన పశువుల ఎరువు ఎకరానికి 6-8 టన్నులు వేయాలి.

నత్రజని, ఫాస్పరస్, పొటాష్ వంటివి భూమిని ఒకసారి లోతుగా దున్నుకొని పశువుల ఎరువు వేసి, భూమిలో బాగా కలిసేట్లు దున్నుకోవాలి. మొక్కలు నాటే ముందు తిరిగి దున్నుకొని రసాయనిక ఎరువువేసి నాగలితో సాళ్లు తోలుకోవాలి. తయారుచేసుకొన్న భూమిలో 40 సెం.మీ 40 సెం.మీ అంతరంతో మొక్కలను నాటుకోవాలి. మొక్కలు నాటిన 30 రోజులకు ఒకసారి, 60 రోజుల తరువాత మరొకసారి కలుపు తీసుకోవాలి. ఆ తరువాత మొక్కలు పెరిగి విస్తరించబడిన కలుపు తీసుకొని ఎరువులు వేస్తుండాలి. నాటిన ఒక నెలవరకు వారానికి 2 సార్లు, మెక్కలు కుదురుకున్న తరువాత, వాతావరణ, భూ పరిస్థితులను బట్టి వారానికొకసారి నీరివ్వాలి.