Vaiyaribhama : పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్న కలుపుమొక్క వయ్యారిభామ! నివారణకు చేపట్టాల్సిన చర్యలు

పంటపొలాల్లో మొలచిన వయ్యారి భామను పూత పూయకముందే బురతలోకి కలియదున్నాలి. తరువాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. దీన్ని పూత దశకు ముందే వేళ్లతో సహా పీకి తగల బెట్టాలి.

Vaiyaribhama : పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్న కలుపుమొక్క వయ్యారిభామ! నివారణకు చేపట్టాల్సిన చర్యలు

Vaiyaribhama :

Vaiyaribhama : వయ్యారిభామ ఈ పేరు వింటేనే రైతులు హడలెత్తిపోతారు. ఒక్క మొక్క లక్షల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. విత్తనాన్ని గాలి ద్వారా వ్యాపింప చేస్తుంది. వయ్యారిభామ అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క, మొక్కల ఎదుగుదలను నియంత్రిస్తుంది. పూత, పిందెలపై ప్రభావం చూపి దిగుబడిని తగ్గించే ఈ మొక్కను వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే నియంత్రించుకోవాలి.

ఇతర పంటల మొలక శాతం తగ్గిపోవడంతో పాటు, పంట ఎదుగుదల తగ్గిపోతుంది. పంటకు వేసిన ఎరువుల సారాన్ని పీల్చివేస్తుంది. 40 శాతం వరకు పంట దిగుబడిని తగ్గించే గుణం దీనికుంది. నత్రజని, పోషక విలువలు, సూక్ష్మ ధాతువుల శాతాన్ని తగ్గిస్తుంది. పత్తి మొక్కజొన్న, గోదుమ, అపరాలు, మల్బరీ తోటలు, మామిడి, జీడి మామిడి తోటల్లో ఎక్కువగా పెరుగుతాయి.

మనుషులకు హానికరమే ;

వయ్యారి భామ మనుషులకు ప్రమాదకరమైన డెర్కాటైటిస్, ఎగ్జిమా, హైపివర్, ఉబ్బసం, బ్రాంకైటీస్ వ్యాధులు రావడానికి కారణమవుతుంది. ఈ మొక్క ఆకులు చర్మానికి రాసుకుంటే తామర వస్తుంది. పుప్పొడిని పీలిస్తే జలుబు, కండ్లు ఎర్రబడటం , కను రెప్పలు వాపులు వస్తాయి. జంతువులకు వెంట్రుకలు రాలిపోతాయి. హైపర్ టెన్షన్ పెరుగుతుంది.

వయ్యారిభామను తిన్న పశువుల పాలను తాగితే మెదడు పనితీరు మందగిస్తుంది. వీటిని తిన్న పశువుల జీర్ణక్రియ కిడ్నీ, లివర్, అన్నవాహిక , శ్వాసక్రియలు దెబ్బతింటాయి. చివరకు మృత్యువాత పడతాయి.

నివారణ చర్యలు ;

పంటపొలాల్లో మొలచిన వయ్యారి భామను పూత పూయకముందే బురతలోకి కలియదున్నాలి. తరువాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. దీన్ని పూత దశకు ముందే వేళ్లతో సహా పీకి తగల బెట్టాలి. కాలుతున్న సమయంలో పొగకు దూరంగా ఉండాలి. తంగే చెట్టు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు. వయ్యారిభామను నివారించే శక్తి తంగేడు మొక్కకు ఉంది. పొలాల గట్లు, బంజరు భూముల్లో తంగేడు చెట్లను నాటుకోవటం మేలు. కలుపు మొక్క పూత దశకు రాక ముందుగా 10 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పు కలిపి ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఇలా చేస్తే మొక్కలు నిర్మూలించ బడతాయి.