మే మూడో వారంలో ఏపీ ఎంసెట్ ఫలితాలు

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 11:18 AM IST
మే మూడో వారంలో ఏపీ ఎంసెట్ ఫలితాలు

ఏపీ ఎంసెట్ ఫలితాలు ఆలస్యంగా విడుదల కానున్నాయి. మే మూడో వారంలో ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. ఏపీ ఇంటర్ మార్కులు అందుబాటులో ఉంచాలని ఇంటర్ బోర్డుకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఎల్బీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇచ్చినా ఎంసెట్ కోసం మార్కులు ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయిన తర్వాతే ఏపీ ఎంసెట్ ఫలితాలు రిలీజ్ చేస్తారు. ఎంసెట్ ఫలితాల విడుదలపై సీఎస్ ఎల్వీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఏపీపైనా పడింది. ఎంసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీనికి కారణం.. తెలంగాణలో రీ వెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ ఉండటమే. 20వేల మంది తెలంగాణ స్టూడెంట్స్.. ఏపీ ఎంసెట్ రాశారు. వారికి ఇంకా మెమోలు రాలేదు. దీనికితోడు కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లపైనా విధివిధానాలు ఖరారు కాలేదు. ఈ 2 విషయాలపై క్లారిటీ వచ్చిన తర్వాతే ఎంసెట్ ర్యాంకులు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ అంశంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. 2, 3 రోజులు ఆలస్యం అయినా పక్కాగా జరిగిపోవాలని.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read : SBI కొత్త రూల్ : సేవింగ్స్ ఖాతాలో నిల్వలపై వడ్డీ తగ్గింపు