Andra Pradesh : యాపిల్ ధరలతో పోటీపడుతున్న నిమ్మకాయలు! ధర వింటే గొంతెండిపోవాల్సిందే..!

నిమ్మకాయలకు రికార్డు ధర పలికింది. మార్కెట్‌కు ఓ రైతు తెచ్చిన మొదటిరకం నిమ్మకాయలను వ్యాపారులు కిలో రూ. 160 చొప్పున కొనుగోలు చేశారు.

Andra Pradesh : యాపిల్ ధరలతో పోటీపడుతున్న నిమ్మకాయలు! ధర వింటే గొంతెండిపోవాల్సిందే..!

Lemon Rates Compete To Apple Rates In Nellore

Lemon Rates in AP : వేసవి ఎండలు మండిపోతున్నాయి.ఏప్రిల్ నెలలోనే మే నెల ఎండలుమండిస్తున్నాయి. బయటకు రావాలంటేనే భయమేస్తోంది. వేసవికాలంలో ఎండలతో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇది చాలదన్నట్లుగా నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఒక్క నిమ్మకాయలు ధర వింటేనే గొంతెండిపోతోంది. యాపిల్ ధరలతో నిమ్మకాయల ధరలు పోటీ పడుతున్నాయి.

ఈ ఏడాది ఎండకాలం ముందే వచ్చేసింది. మార్చి నెలలోనే ఎండలు మండిపోయాయి. ఇక ఏప్రిల్ లో చెప్పుకోనే అక్కర్లేదు. ఉదయం 9.00గంటలకే ఎండ తీవ్రతతో బయటకు రావాలంటే భయపడాల్సి వస్తోంది. ఈ ఎండలకు తోడు నిమ్మకాయలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో వాటి ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్‌లో నిన్న నిమ్మకాయలకు రికార్డు ధర పలికింది. మార్కెట్‌కు ఓ రైతు తెచ్చిన మొదటిరకం (ఆకుపచ్చ) నిమ్మకాయలను వ్యాపారులు కిలో రూ. 160 చొప్పున కొనుగోలు చేశారు.

రెండో రకం కాయలు రూ. 130-150 మధ్య పలుకుతుండగా, నిమ్మ పండ్లు రూ. 100-130 మధ్య ధర పలుకుతున్నాయి. గతేడాదితో పోలిస్తే వీటికి ఇప్పుడు రెట్టింపు ధర పలుకుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఇక, జిల్లాలో కిలో యాపిల్ పండ్లను రూ. 150-200 మధ్య విక్రయిస్తుండడం గమనించాల్సిన విషయం.