CM Jagan : ఉత్తరాంధ్రలో తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష

ఉత్తరాంధ్రలో తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాన్‌ పరిస్థితులపై ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు.

CM Jagan : ఉత్తరాంధ్రలో తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష

Cm Jagan (1)

CM Jagan review on cyclone conditions : ఉత్తరాంధ్రలో తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాన్‌ పరిస్థితులపై ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తుపాన్‌ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

మరోవైపు ఉత్తరాంధ్రలో తుపాన్‌ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్‌ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాలకు శ్యామలరావును నియమించారు. వారు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాన్‌ సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షక బాధ్యతలు స్వీకరించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Superstitions : ప్రాణాలు తీస్తున్న మూఢ నమ్మకాలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఇవాళ, రేపు పర్యటించనున్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. వరద బాధిత ప్రజలను, రైతులను కలిసి పరామర్శిస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రేపు తిరుపతితో పాటు నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

మరోవైపు తిరుమల రెండవ ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతం వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఘాట్‌రోడ్డులో ఎక్కువ భాగం ధ్వంసం కావడంతో.. దీన్ని పునరుద్ధరించేందుకు మరో మూడురోజులు పట్టవచ్చని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఒకే ఘాట్‌ రోడ్ మీదుగా తిరుమల-తిరుపతికి రాకపోకలు సాగుతున్నాయి.

Suicide : పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

ఈ క్రమంలోనే తిరుమలకు ప్రయాణం పెట్టుకున్న భక్తులు కనీసం పదిహేను రోజుల పాటు వాయిదా వేసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. చెన్నై ఐఐటీ టీమ్‌ ఘాట్‌రోడ్‌ను పరిశీలించగా.. ఇవాళ ఢిల్లీ ఐఐటీ బృందం తిరుమలకు వచ్చిన ఘాట్ రోడ్డును పరిశీలించనుంది.