Kodali Nani : ఆర్‌5 జోన్ పై సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన కొడాలి నాని

వేలాది మంది పేదలకు న్యాయం చేసిన కోర్టుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణ నగరంగా ఉండాలన్న పిడి వాదన నుండి అమరావతి బయటపడిందని చెప్పారు.

Kodali Nani : ఆర్‌5 జోన్ పై సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన కొడాలి నాని

Kodali Nani

Supreme Court R5 zone : ఆర్‌5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చన్న సుప్రీంకోర్టు ఆదేశంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పేదల పక్షాన న్యాయం ఉంటుందనడానికి సుప్రీంకోర్టు తీర్పే ఉదాహరణ అని అన్నారు. పేదలు అమరావతిలోకి రాకుండా మూడేళ్లుగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వేలాది మంది పేదలకు న్యాయం చేసిన కోర్టుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణ నగరంగా ఉండాలన్న పిడి వాదన నుండి అమరావతి బయటపడిందని చెప్పారు. ఈ మేరకు కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

లోకేశ్ ను ఓడించడానికే వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుందని టీడీపీ నేతలు ఎలా అంటారని ప్రశ్నించారు. పేదలు ఉన్న చోట లోకేశ్ ఓడిపోతాడని టీడీపీ నేతలకు నమ్మకం కలిగిందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పేదల పార్టీయేనని చెప్పారు. ఆర్ 5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అమరావతి రాజధాని కేసు విచారిస్తోన్న బెంచ్ కు సుప్రీంకోర్టు ఈ కేసును బదిలీ చేసింది.

Kodali Nani : సీఎం జగన్ పై సినిమా తీయాలన్న పవన్ ట్వీట్ కు కొడాలి నాని కౌంటర్

ఆర్ 5 జోన్ వ్యవహారంలో సోమవారం మే15న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అమరావతి రాజధాని కేసుతో పాటుగా ఈ ఆర్5 జోన్ వ్యవహారం కూడా విచారణ జరపాలని తెలిపింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పిటిషన్లు ఉన్నాయి. ఒక ధర్మాసనం ముందు ఆర్ 5 జోన్ పిటిషన్ ఉండగా, అమరావతి రాజధాని పిటిషన్ మరొక ధర్మాసనం ముందు ఉంది.

రెండు పిటిషన్లు కూడా ఒకే ధర్మాసనం విచారించాలని చెప్పి న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్ లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు రిజిస్ట్రార్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది. కాగా, ఆర్ 5 జోన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రైతులు, టీడీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Bhuma Akhilapriya Remand : భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ కు 14 రోజుల రిమాండ్

సోమవారం ఆర్ 5 జోన్ పై సుప్రీంకోర్టులో విచారణకు రాగా, రైతుల తరపున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహిత్ గీ వాదనలు వినిపించారు. అయితే అమరావతి కేసుతోపాటు ఆర్ 5 జోన్ కేసును కలిపి విచారణ జరపాలని నిర్ణయిస్తూ అమరావతి కేసును విచారిస్తున్న జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందు ఆర్ 5 జోన్ పిటిషన్ బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.