Telangana : రాయల తెలంగాణ కావాలన్న జేసీ దివాకర్ రెడ్డి .. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి

రాయల తెలంగాణ కోరడం తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడానికి నిదర్శనం అని,తెలంగాణలో కలపాలని తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరడం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు.

Telangana : రాయల తెలంగాణ కావాలన్న జేసీ దివాకర్ రెడ్డి .. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి

Telangana : కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వరం ప్రాజక్టును నిర్మించారని పెద్దమనస్సుతో ఆ నాటికి రాయలసీమకు మళ్లించాలని..రాయల తెలంగాణ కావాలని దాని కోసం కృషి చేస్తానని..మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు.కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారమవతుందని..రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఆంధప్రదేశ్ లో ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెర మీదకు వచ్చిందని..ప్రత్యేక రాయలసీమ , రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదని అన్నారు జగదీశ్ రెడ్డి.

రాయల తెలంగాణ కోరడం తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడానికి నిదర్శనం అని అన్నారు. తెలంగాణలో కలపాలని తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరడం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణాలో కలపండి లేకపోతే మా దగ్గరికి రండి అని కేసీఆర్ ని ఆహ్వానిస్తున్నారని, తెలంగాణ బంగారు తెలంగాణగా మారినట్టే సువర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమని గతంలోనే చెప్పారని ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.

Kurnool: రాయల తెలంగాణ కావాలన్న జేసీ దివాకర్ రెడ్డి.. గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం కావాలన్న మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి

పరిపాలకుల్లో చిత్తుశుద్ధి లోపంతో ఇలాంటి డిమాండ్లు వస్తాయని..పరిపాలకులను మార్చండి సువర్ణాంధ్ర గా మార్చుకోండి అంటూ సూచించారు. అంటే పరోక్షంగా బీఆర్ఎస్ ను గెలిపించాలనే ఉద్ధేశ్యంతో జగదీశ్ రెడ్డి ఈ సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అందుకే రాయలతెలంగాణ అంటున్నారని అన్నారు. వెనుకబాటుకు కారణమైన పరిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేయాలని ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్ర ప్రజలు నాయకులు ఆలోచించాలని సూచించారు.