AP Bandh: రాష్ట్ర బంద్‌కు టీడీపీ పిలుపుతో.. ఏపీలో టెన్షన్ టెన్షన్.. ఎక్కడికక్కడ అరెస్టులు!

ఏపీలో ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరిలో TDP కార్యాలయంపై YCP శ్రేణుల దాడితో.. పార్టీల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కు వెళ్లింది. దాడికి నిరసనగా TDP రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.

AP Bandh: రాష్ట్ర బంద్‌కు టీడీపీ పిలుపుతో.. ఏపీలో టెన్షన్ టెన్షన్.. ఎక్కడికక్కడ అరెస్టులు!

Tdp

ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడితో.. ఇరు పార్టీల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కు వెళ్లింది. దాడికి నిరసనగా.. టీడీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. పార్టీ కార్యాలయాలపై దాడి చరిత్రలో ఎన్నడూ జరగలేదని.. ఇది అప్రజాస్వామికమని ఆ పార్టీ నేతలు తవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పోలీసులదే బాధ్యత అని తేల్చారు.

డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే పోలీసులు ఏ మాత్రం స్పందించలేదని.. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసనకు దిగిన రామ్మోహన్ తో పాటు.. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ను విజయవంతం చేసేందుకు శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ప్రధాన నాయకులను గృహ నిర్బంధం చేస్తున్నారు. బయటకు వచ్చిన నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు.

ఒంగోలు బస్టాండ్ వద్ద నిరనసకు దిగిన పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆర్టీసీ బస్సులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. వారిని పోలీసులు నిలువరించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో టీడీపీ నేతలు ఆందోళన చేశారు. నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తును మోహరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), టీడీపీ అంగన్ వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీతను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆందోళనలు చేసే వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Read More:

YCP Workers Attack On TDP Office : ఏపీలో టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తల దాడి