డబ్బు దాచుకోండి : 10 రోజులు మూతపడనున్న బ్యాంకులు

బ్యాంకు కస్టమర్లకు ముఖ్యమైన న్యూస్. బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తం కావాల్సిన సమయం. బ్యాంకులతో ఏవైనా పనులు ఉంటే ముందే జాగ్రత్త పడండి. మీ పనులను షెడ్యూల్

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 06:27 AM IST
డబ్బు దాచుకోండి : 10 రోజులు మూతపడనున్న బ్యాంకులు

బ్యాంకు కస్టమర్లకు ముఖ్యమైన న్యూస్. బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తం కావాల్సిన సమయం. బ్యాంకులతో ఏవైనా పనులు ఉంటే ముందే జాగ్రత్త పడండి. మీ పనులను షెడ్యూల్

బ్యాంకు కస్టమర్లకు ముఖ్యమైన న్యూస్. బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తం కావాల్సిన సమయం. బ్యాంకులతో ఏవైనా పనులు ఉంటే ముందే జాగ్రత్త పడండి. మీ పనులను షెడ్యూల్ చేసుకోండి. డబ్బు దాచుకోండి. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. మ్యాటర్ ఏంటంటే.. బ్యాంకులకు ఏకంగా 10 రోజులు సెలవులు వచ్చాయి. అక్టోబర్ నెలలో అత్యధిక సెలవు రోజులు ఉన్నాయి. శని, ఆదివారాలకు తోడు దసరా, దీపావళి పండుగలు మరికొన్ని ప్రత్యేక రోజులు ఈ నెలలోనే ఉన్నాయి. దీంతో మొత్తం 11రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

ఇప్పటికే గాంధీ జయంతి(అక్టోబర్ 2) సెలవు ముగిసింది. ఇంకా 10 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. అసలే పండుగ సీజన్. షాపింగ్ లు, టూర్లు, సెలబ్రేషన్స్ ఇలా అనేకం ఉంటాయి. వీటన్నింటికి డబ్బు కావాలి. దీంతో నగదు అవసరమున్న వారు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ముందే బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకోవాలని చెబుతున్నారు. ఈ సెలవులు అన్ని ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు వర్తిస్తాయి. ఆయా బ్యాంకుల ఆప్షనల్ సెలవు రోజులను కూడా ఓసారి పరిశీలించాలని ఖాతాదారులకు అధికారులు సూచించారు.

బ్యాంకులకు సెలవులు:
అక్టోబర్ 6 – ఆదివారం
అక్టోబర్ 7 – మహర్నవమి
అక్టోబర్ 8 – దసరా
అక్టోబర్ 12 – రెండో శనివారం
అక్టోబర్ 13 – ఆదివారం
అక్టోబర్ 20 – ఆదివారం, వాల్మీకి జయంతి
అక్టోబర్ 26 – నాలుగో శనివారం
అక్టోబర్ 27 – దీపావళి
అక్టోబర్ 28 – గోవర్థన పూజ
అక్టోబర్ 29 – భాయ్ దూజ్ (యమ తదియ)
అక్టోబర్ 26, 27, 28 వరుసగా 3 రోజులు సెలవులు