Tecno Camon 30 Series : టెక్నో కామన్ 30 సిరీస్ వచ్చేస్తోంది.. సోనీ కెమెరాలతో మొత్తం 4 మోడల్స్.. పూర్తి వివరాలివే!

Tecno Camon 30 Series : ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024లో ఈ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించగా, అనంతరం బేస్, ప్రో వేరియంట్‌లను నైజీరియాలో కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.

Tecno Camon 30 Series : టెక్నో కామన్ 30 సిరీస్ వచ్చేస్తోంది.. సోనీ కెమెరాలతో మొత్తం 4 మోడల్స్.. పూర్తి వివరాలివే!

Tecno Camon 30 Series India Launch ( Image Credit : Google )

Tecno Camon 30 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. అతి త్వరలో భారత మార్కెట్లో టెక్నో కామన్ 30 సిరీస్ ఆవిష్కరించనుంది. దేశంలో ఈ లైనప్‌కు సంబంధించి వివరాలను కంపెనీ ధృవీకరించింది. అయితే, భారత్‌లో ఏయే మోడల్‌లను లాంచ్ చేస్తారో టెక్నో వెల్లడించలేదు.

Read Also : Vivo Y200 5G Series : ఈ నెల 20నే వివో Y200 5జీ సిరీస్ లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? వివో Y200 GT 5జీ డిజైన్ ఇదిగో!

ఈ సిరీస్‌లో మొత్తం 4 మోడల్‌లు ఉన్నాయి. టెక్నో కామన్ 30, కామన్ 30 5జీ, కామన్ 30ప్రో 5జీ, కామన్ 30 ప్రీమియర్ 5జీ ఉండనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024లో ఈ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించగా, అనంతరం బేస్, ప్రో వేరియంట్‌లను నైజీరియాలో కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.

ఇప్పుడు, టెక్నో మొబైల్ ఇండియా భారత్‌లో టెక్నో కామన్ 30 సిరీస్‌ను లాంచ్ తేదీని రివీల్ చేయకుండానే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. వీడియో, ఫోన్‌లలో సోనీ లైటియా కెమెరాలు అమర్చి ఉన్నాయి. మరో టీజర్ బ్లాక్ వేగన్ లెదర్ ఆప్షన్లలో రాబోయే మోడల్‌లలో ఒకదాన్ని టీజ్ చేసింది. ఈ టీజర్‌లో కనిపించే టెక్నో కామన్ 30 సిరీస్ మోడల్ డిజైన్, హ్యాండ్‌సెట్‌ల ఇండియా వేరియంట్ వారి గ్లోబల్ కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే ఉంటుందని సూచిస్తుంది. ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను షేర్ చేసుకోవాలని భావిస్తున్నారు.

ఈ నెలలో దేశంలో ఫోన్‌లను ఆవిష్కరించవచ్చు. టెక్నో కామన్ 30 4జీ, మీడియాటెక్ హెలియో జీ99 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. అయితే, 5జీ వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీని కలిగి ఉంటుంది. కామన్ 30ప్రో 5జీ ఫోన్ హై-ఎండ్ కామన్ 30 ప్రీమియర్ 5జీ మోడల్‌లు మీడియాటెక్ డైమన్షిటీ 8200 ఎస్ఓసీతో వస్తాయి. 5,000ఎంఎహెచ్ బ్యాటరీల ద్వారా సపోర్టు ఇస్తాయి. 70డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. టెక్నో కామన్ 30 4జీ 5జీ వేరియంట్‌లు 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో పాటు డ్యూయల్ రియర్ ఫ్లాష్ యూనిట్‌లను కలిగి ఉంటాయి.

మరోవైపు.. టెక్నో కామన్ ప్రో 5జీ, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 1/1.56-అంగుళాల 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 50ఎంపీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. టెక్నో కామన్ 30ప్రో 5జీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో మరో 50ఎంపీ సెన్సార్, మూడో 50ఎంపీ సెన్సార్‌తో వస్తుంది. క్వాడ్ ఫ్లాష్ యూనిట్‌తో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంది. అన్ని మోడల్స్ 50ఎంపీ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటాయి.

Read Also : Vivo X100 Ultra : వివో X100 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కెమెరా ఫీచర్లు లీక్..!