Top 10 Selling Cars 2023 : ఏప్రిల్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఇవే.. ఫుల్ లిస్టు ఇదిగో..!

Top 10 Selling Cars 2023 : గత ఏప్రిల్ 2023లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఏంటో తెలుసా? కొనుగోలుదారులు అధిక మొత్తంలో ఈ SUV కార్లనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారని ఓ నివేదిక తెలిపింది.

Top 10 Selling Cars 2023 : ఏప్రిల్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఇవే.. ఫుల్ లిస్టు ఇదిగో..!

Top 10 selling cars in April 2023_ WagonR, Baleno, Nexon, Creta shine

Top 10 Selling Cars 2023 : ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీ పరిశ్రమలో ప్యాసింజర్ వెహికల్ (PV)లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఒకవైపు.. సరఫరా సవాళ్లు ఉన్నప్పటికీ.. అధిక డిమాండ్ నేపథ్యంలో జోరుగా కొనుగోళ్లు కొనసాగాయి. ఏప్రిల్‌లో గరిష్టంగా 331,747 యూనిట్లతో వాల్యూమ్‌లను పూర్తి చేసింది. ఆసక్తికరంగా, ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 మోడళ్లలో 5 స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు (SUVలు), 4 హ్యాచ్‌బ్యాక్‌లు, ఒక వ్యాన్ కూడా ఉన్నాయి. SUV సెగ్మెంట్‌లో ఆధిపత్యాన్ని పెంచేలా మార్కెట్ వాటా ఏప్రిల్‌లో PV ఇండస్ట్రీలో 47.4శాతానికి చేరింది.

ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 వాహనాల్లో మారుతీ సుజుకి ఇండియా (Maruti Suzuki India) ఆరు మోడళ్లను కలిగి ఉండగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India), టాటా మోటార్స్ (Tata Motors) రెండు మోడల్స్ కలిగి ఉన్నాయి. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (WagonR), మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి సుజుకి బాలెనో, టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి బ్రెజా, మారుతి సుజుకి ఆల్టో, టాటా పంచ్, మారుతి సుజుకి ఈకో, హ్యుందాయ్ వెన్యూ ఏప్రిల్ 10లో అమ్ముడైన కార్లలో టాప్ 10లో కింది జాబితాలో ఉన్నాయి.

Read Also : Best Smartphones in India : రూ.15వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

టాప్ 3 మారుతీ కార్లు ఇవే :
ఏప్రిల్‌లో వ్యాగన్ఆర్ (WagonR) 20,879 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడైన కారుగా చెప్పవచ్చు. ఆ తర్వాత స్విఫ్ట్ కారు 18,573 యూనిట్లు, బాలెనో 16,180 యూనిట్ల వద్ద ఉన్నాయి. ఆ తర్వాత మూడు SUV కార్లు కూడా ఉండగా..  నెక్సాన్ 15,002 యూనిట్ల వద్దకు చేరింది. దీని వెనుక 14,186 యూనిట్ల వద్ద క్రెటా (Creta)తో 11,836 యూనిట్ల వద్ద బ్రెజ్జా ఉన్నాయి. మారుతీ, టాటా, హ్యుందాయ్ కూడా ఈ జాబితాలో చేరాయి. ఇక, ఆల్టో (Altro) మళ్లీ 11,548 యూనిట్ల వాల్యూమ్‌లతో టాప్ 10లో నిలిచింది. మరో మోడల్ కారు పంచ్ 10,934 యూనిట్ల వద్ద ఉంది. ఎకో (Eeco) వ్యాన్ మాత్రమే 10,504 యూనిట్లను చేరింది. 10,342 యూనిట్ల అమ్మకాలతో వెన్యూ దూసుకెళ్లింది.

Top 10 selling cars in April 2023_ WagonR, Baleno, Nexon, Creta shine

Top 10 Selling Cars 2023 in April 2023_ WagonR, Baleno, Nexon, Creta shine

ఏప్రిల్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఇవే :

* మారుతి సుజుకి వ్యాగన్ఆర్ – 20,879 యూనిట్లు
* మారుతి సుజుకి స్విఫ్ట్ – 18,573 యూనిట్లు
* మారుతి సుజుకి బాలెనో – 16,180 యూనిట్లు
* టాటా నెక్సాన్ – 15,002 యూనిట్లు
* హ్యుందాయ్ క్రెటా – 14,186 యూనిట్లు
* మారుతి సుజుకి బ్రెజ్జా – 11,836 యూనిట్లు
* మారుతి సుజుకి ఆల్టో – 11,548 యూనిట్లు
* టాటా పంచ్ – 10,934 యూనిట్లు
* మారుతి సుజుకి ఈకో – 10,504 యూనిట్లు
* హ్యుందాయ్ వెన్యూ – 10,342 యూనిట్లు

Read Also : Amazon Great Summer : మే 4 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్స్ అసలు మిస్ కాకండి..!