Xiaomi Pad 6 Launch : అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 6 వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?
Xiaomi Pad 6 Launch : షావోమీ (Xiaomi) ప్యాడ్ 6 బ్యాక్ సైడ్ 13MP ప్రధాన కెమెరా, ఫొటోలు, వీడియోల కోసం 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వచ్చింది.

Xiaomi Pad 6 with Snapdragon 870 launched in India, price starts at Rs 26,999
Xiaomi Pad 6 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ (Xiaomi) చివరకు ప్యాడ్ 6 (Xiaomi Pad 6)ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ప్యాడ్ 6 అనేది ప్యాడ్ 5 తర్వాత మార్కెట్లోకి వచ్చింది. ఈ టాబ్లెట్ ముందున్న ప్యాడ్ 5 వంటి స్మార్ట్‌పెన్‌తో పాటు కీబోర్డ్‌కు సపోర్టుతో వస్తుంది. డిజైన్‌లో ప్యాడ్ 6 ప్రాసెసర్‌లో కొంచెం అప్‌గ్రేడ్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 870 ద్వారా ఆధారితమైనది. షావోమీ ప్యాడ్ 6 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 860కి అప్‌గ్రేడ్ అయింది.
కొనుగోలుదారులు 6GB, 8GB వేరియంట్ వేరియంట్‌లతో రెండు విభిన్న వేరియంట్‌లను పొందవచ్చు. వరుసగా 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్‌లు ఉండనున్నాయి. ఈ టాబ్లెట్‌ను కొన్ని నెలల క్రితమే చైనాలో లాంచ్ చేసింది. చేశారు. షావోమీ ప్యాడ్ 6 తో పాటు ప్యాడ్ 6 ప్రోని ఆవిష్కరించింది కానీ, భారత మార్కెట్లో షావోమీ ప్రో వెర్షన్ లాంచ్ చేయలేదు.
షావోమీ ప్యాడ్ 6 ధర ఎంతంటే? :
షావోమీ ప్యాడ్ 6 టాబ్లెట్ 6GB+128GB వేరియంట్‌కు రూ. 26,999, 8GB+456GB వేరియంట్ ధర రూ. 28,999గా ఉంది. అయితే, మీకు ICICI బ్యాంక్ కార్డ్ ఉంటే.. ఈ డివైజ్‌పై రూ. 3వేలు డిస్కౌంట్ పొందవచ్చు. యాక్సెసరీస్ విషయానికి వస్తే.. కీబోర్డ్ ధర రూ. 4999, స్మార్ట్ పెన్ ధర రూ. 5999, కేస్ ధర రూ.1499కి మాత్రమే కొనుగోలు చేయవచ్చు.
షావోమీ ప్యాడ్ 6 స్పెసిఫికేషన్‌లు ఇవే :
షావోమీ ప్యాడ్ 6 11-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. హై-క్వాలిటీ ఫొటోలను అందిస్తుంది. స్క్రీన్ సెకనుకు 144 సార్లు రిఫ్రెష్ చేయగలదు. ఈ టాబ్లెట్‌లో Snapdragon 870 అని పిలిచే పవర్‌ఫుల్ ప్రాసెసర్ కలిగి ఉంది. యాప్‌లు, ఫొటోలు, వీడియోలను స్టోర్ చేసేందుకు బెస్ట్ మెమరీ, స్టోరేజ్ స్పేస్‌ను కూడా కలిగి ఉంది. ఈ ప్యాడ్ 6 ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14పై రన్ అవుతుంది. ఫొటోలు, వీడియోల క్యాప్చర్ చేసేందుకు టాబ్లెట్‌లో బ్యాక్ సైడ్ కెమెరా ఉంది. 13MP కెమెరాతో ఫోటోలు తీయగలదు. సెల్ఫీలు, వీడియో కాల్ కోసం ముందు భాగంలో కెమెరా కూడా ఉంది. వైడ్ యాంగిల్ క్యాప్చర్ చేయగలదు. టాబ్లెట్‌లో హై-క్వాలిటీ సౌండ్ చేసే స్పీకర్‌లు ఉన్నాయి. డాల్బీ అట్మోస్ అనే టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది.

Xiaomi Pad 6 with Snapdragon 870 launched in India, price starts at Rs 26,999
మీరు Wi-Fiని ఉపయోగించి ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయవచ్చు. మీరు బ్లూటూత్ లేదా USB పోర్ట్‌ని ఉపయోగించి టాబ్లెట్‌కి ఇతర డివైజ్‌లను కూడా కనెక్ట్ చేయవచ్చు. టాబ్లెట్‌లో మూమెంట్, లైటింగ్ గుర్తించగల సెన్సార్‌లు ఉన్నాయి. టైప్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మీరు టాబ్లెట్‌కి కీబోర్డ్‌ను యాడ్ చేయొచ్చు. ఈ స్క్రీన్‌పై రాయడానికి లేదా గీయడానికి స్పెసల్ పెన్ కూడా ఉపయోగించవచ్చు. టాబ్లెట్‌లో లైఫ్ లాంగ్ బ్యాటరీ ఉంది. ఒకే ఛార్జ్‌పై రెండు రోజుల పాటు ఉంటుంది. బ్యాటరీ అయిపోయినా.. మీరు కేబుల్ ఉపయోగించి త్వరగా ఛార్జ్ చేయవచ్చు. టాబ్లెట్ సన్నగా తేలికగా ఉంటుంది. ఎక్కడికైనా ఈజీగా క్యారీగా చేసుకునేలా ఉంటుంది.
రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్ స్పెసిఫికేషన్‌లు ఇవే :
రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్ స్టైలిష్ డిజైన్‌ను అందిస్తుంది. ఆకట్టుకునే ఫీచర్లతో 12mm బాస్ ప్రో డ్రైవర్‌ల ద్వారా ఈ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్‌లు ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. 30 గంటల వరకు అద్భుతమైన బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్‌లు సుదీర్ఘ ఎంటర్‌టైన్మెంట్ సెషన్‌లకు సరైనవిగా చెప్పవచ్చు.