Hyderabad Drugs: డ్రగ్స్ కేసులో ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నాం: నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ డీసీపీ చక్రవర్తి

హైదరాబాద్ శివమ్ రోడ్డులో మాదక ద్రవ్యాల ముఠాను అరెస్ట్ చేసిన వ్యవహారంపై నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ డీసీపీ చక్రవర్తి..10టీవీతో ప్రత్యేకించి

Hyderabad Drugs: డ్రగ్స్ కేసులో ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నాం: నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ డీసీపీ చక్రవర్తి

Dcp

Hyderabad Drugs: మాదక ద్రవ్యాలకు బానిసై..హైదరాబాద్ నగరంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ ను నిర్ములించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న పోలీసులకు..మొట్టమొదటిసారిగా డ్రగ్స్ తీసుకుని ఓ యువకుడు మృతి చెందడం సవాలుగా మారింది. దీంతో డ్రగ్స్ మూలలను గుర్తించి సమూలంగా పెకిలించే దిశగా పోలీసులు కసరత్తు ప్రారంభించారు. గురువారం హైదరాబాద్ శివమ్ రోడ్డులో మాదక ద్రవ్యాల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమేరకు డ్రగ్స్ అమ్మిన వారిని, కొనుగోలు చేసిన వారిని అరెస్ట్ చేసివిచారిస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. కాగా ఈ వ్యవహారంపై నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ డీసీపీ చక్రవర్తి..10టీవీతో ప్రత్యేకించి మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.

Also read:Drugs Caught in City: డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి: హైదరాబాద్ లోనే మొదటి కేసు నమోదు

శివమ్ రోడ్ డ్రగ్స్ కేసు ఘటనలో ప్రేమ్ అనే డ్రగ్స్ పెడ్లర్ ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ చక్రవర్తి తెలిపారు. ప్రేమ్ అతని ముఠా తరచు పార్టీలంటూ గోవాకు వెళ్లి డ్రగ్స్ కు బానిసయ్యారని తెలిపారు. ఈ కేసులో ఒక ప్రైవేటు ఉద్యోగితో పాటు..గిటార్ ప్లేయర్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. హాష్ ఆయిల్ ను లక్ష్మీపతి అనే పెడ్లర్ కొనుగోలు చేసినట్లు ఆధారాలు సేకరించామని..డ్రగ్స్ మొత్తం వివిధ ప్రాంతాల నుండి వస్తున్నట్లు గుర్తించామని డీసీపీ పేర్కొన్నారు. లక్ష్మి పతి కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గోవాకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామని గోవా వెళ్లివచ్చేవారిపై నిఘా ఉంచినట్లు డీసీపీ తెలిపారు.

Also read:Sanathnagar Crime: సనత్ నగర్ పరిధిలో ఘోరం: నిద్రిస్తున్న మహిళ గొంతు కోసి పరారైన దుండగుడు

ఇప్పటి వరకు కాల్ సెంటర్స్, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, బిటెక్ స్టూడెంట్స్, గిటార్ నేర్చుకునేవారిని గుర్తించామని.. విద్యాసంస్థల్లోనూ, లేబర్స్, ప్రారిశ్రామికవేత్తలు సైతం డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తమ విచారణలో తేలినట్లు డీసీపీ చక్రవర్తి వివరించారు. డ్రగ్స్ వాడే వారి వివరాలు సేకరిస్తున్నామని..విశాఖలో డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని గుర్తించామన్న డీసీపీ..గోవాలోనూ డ్రగ్స్ విపరీతంగా కొనుగోలు చేసినట్లు తేలిందని ఆదిశగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యుక్త వయసుకొచ్చిన పిల్లల విషయంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని డీసీపీ చక్రవర్తి సూచించారు. డ్రగ్స్ మూలలను బయటకు తీసి పూర్తిగా నిర్ములించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Also read:Warangal : MGM సూపరింటెండెంట్ బదిలీ.. ఇధ్దరు వైద్యుల సస్పెన్షన్