Drugs Caught in City: డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి: హైదరాబాద్ లోనే మొదటి కేసు నమోదు

హైదరాబాద్ లోని నల్లకుంట శివమ్ రోడ్, జూబిలీహిల్స్ ప్రాంతాల్లో దుర్గ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరాలు వెల్లడించారు

Drugs Caught in City: డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి: హైదరాబాద్ లోనే మొదటి కేసు నమోదు

Drugs

Updated On : March 31, 2022 / 5:23 PM IST

Drugs Caught in City: డ్రగ్స్ అతిగా తీసుకుని యువకుడు మృతి చెందాడని..డ్రగ్స్ తీసుకుని చనిపోయిన ఘటనలో హైదరాబాద్ నగరంలోనే మొదటి కేసు నమోదు చేశామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరించారు. హైదరాబాద్ లోని నల్లకుంట శివమ్ రోడ్, జూబిలీహిల్స్ ప్రాంతాల్లో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈమేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరాలు వెల్లడించారు. నల్లకుంట శివమ్ రోడ్ లో నివసిస్తున్న ప్రేమ్ ఉదయ్ కుమార్ అనే యువకుడు రియల్ ఎస్టేట్ చేస్తుండేవాడు. ఇటీవల శ్రీరామ్ అనే యువకుడితో కలిసి ప్రేమ్ ఉదయ్ డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు.

Also read:Sanathnagar Crime: సనత్ నగర్ పరిధిలో ఘోరం: నిద్రిస్తున్న మహిళ గొంతు కోసి పరారైన దుండగుడు

రామకృష్ణ, జీవన్ రెడ్డి, నిఖిల్ జోషూవ్ అనే కొందరు యువకులు ప్రేమ్ ఉదయ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కెమికల్ బ్యాగ్రౌండ్ లేకున్నా శ్రీరామ్ డ్రగ్స్ తయారు చేయడం నేర్చుకున్నాడని..శ్రీరామ్ తెలివితేటలను..ప్రేమ్..డ్రగ్స్ తయారు చేయడానికి ఉపగించాడని.. వీరిద్దరూ కలిసి కెమికల్ ప్రాసెస్ ద్వారా డ్రగ్స్ తయారీకి అమెజాన్ లాంటి కొరియర్ సర్వీసులను ఉపయోగించుకున్నట్లు ఏసీపీ డీఎస్ చౌహన్ వివరించారు. డ్రగ్స్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అయిన శ్రీరామ్ ఒక ఇల్లీగల్ డ్రగ్ ప్రోడక్ట్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also read:IAS officers: 8 మంది IASలకు 2 వారాలు జైలు శిక్ష

డ్రగ్స్ వినియోగదారులు రామకృష్ణ, జీవన్ రెడ్డి, నిఖిల్ జోషూవ్, లను అరెస్ట్ చేసామన్న ఏసీపీ డీఎస్ చౌహన్…డ్రగ్స్ ప్రధాన సూత్రధారి లక్ష్మీపతి పరారీలో ఉన్నాడని త్వరలోనే అతణ్ణి పట్టకుంటామని తెలిపారు. నిందితుల నుంచి LSD 6 బాటిల్స్, ఎక్స్టెసీ పిల్స్ 10 , హాష్ ఆయిల్ 100 గ్రాములు, నాలుగు మోబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వివరించారు. ఈసందర్భంగా ఆసీఫ్ డీఎస్ చౌహన్ మాట్లాడుతూ డ్రగ్స్ ఎవరూ వాడొద్దని, ఒకసారి వాటికీ అలవాటు పడితే జీవితం నాసమేనని అన్నారు. ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలని డీఎస్ చౌహన్ సూచించారు.

Also read:Sreesailam: దాడుల్లో ధ్వంసమైన షాపులు.. వాహనాలు

డ్రగ్స్ అతిగా తీసుకుని ఒక వ్యక్తి మృతి చెందాడని..డ్రగ్స్ తీసుకుని చనిపోయిన ఘటనలో హైదరాబాద్ నగరంలో మొదటి కేసు నమోదు చేశామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరించారు. మరణించిన యువకుడు డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమ్ స్నేహితుడిగా పోలీసులు పేర్కొన్నారు. మరణించిన వ్యక్తి గోవాలో పలు రకాల డ్రగ్స్ తీసుకోగా..అనారోగ్యానికి గురై..వారం రోజుల్లోనే మృతి చెందాడని డీఎస్ చౌహన్ పేర్కొన్నారు. బీ టెక్ పూర్తి చేసుకున్న ఆ యువకుడు డ్రగ్స్ కి బానిసై నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడని, యువత జాగ్రత్తగా ఉంటూ జీవితాలను సరైన దారిలో పెట్టుకోవాలని లా & ఆర్థర్ అడిషనల్ సీపీ డీఎస్ చౌహన్ హితవు పలికారు. హైదరాబాద్ మహానగర పరిధిలో డ్రగ్స్ దందాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో మాధకద్రవ్యాలను సమూలంగా మట్టుపెట్టాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు.

Also read:Heat Wave Alert : ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు.. వచ్చే 4 రోజులు జాగ్రత్త..!