Heat Wave Alert : ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు.. వచ్చే 4 రోజులు జాగ్రత్త..!

Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా భానుడు భగభగమని మండిపోతున్నాడు. రోజురోజుకీ ఎండ తీవ్రత పెరిగిపోతోంది.

Heat Wave Alert : ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు.. వచ్చే 4 రోజులు జాగ్రత్త..!

Heat Wave Alert Imd Issues Severe Heat Wave Alert First Week Of April Month

Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా భానుడు భగభగమని మండిపోతున్నాడు. రోజురోజుకీ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటేసింది. రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి వెల్లడించారు. ఏప్రిల్ 1, 2,3 తేదీల్లో 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చున్నారు. 2016లో మార్చి నెల చివరి వారంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పారు.

ప్రత్యేకించి ఆరేళ్ల తర్వాత ఈ స్థాయిలో మార్చి నెలలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విదర్భ నుంచి వడగాల్పలు వీస్తున్నాయి. ఈ వడగాల్పుల కారణంగా రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి ఏడాదిలో సాధారణంగా ఏప్రిల్ నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవ్వాల్సి ఉంది. అయితే ఈసారి మాత్రం మార్చి నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Heat Wave Alert Imd Issues Severe Heat Wave Alert First Week Of April Month (1)

Heat Wave Alert Imd Issues Severe Heat Wave Alert First Week Of April Month

వచ్చే మూడు నాలుగు రోజులలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రత్యేకించి మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి సూచించారు. ఎండల తీవ్రతను బట్టి రాష్ట్రంలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేసినట్టు వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.

మరోవైపు.. ఎండల తీవ్రత దృష్ట్యా.. అప్రమత్తమైన పాఠశాల విద్యాశాఖ బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది. నేటి నుంచి ఉదయం 11.30గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. కుదించిన వేళలు ఏప్రిల్‌ 6 వరకు పాటించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ తెలిపింది.

Read Also : Severe Suns : తెలంగాణలో భానుడి భగభగలు, మార్చిలోనే.. మే ఎండలు