Warangal : MGM సూపరింటెండెంట్ బదిలీ.. ఇధ్దరు వైద్యుల సస్పెన్షన్

అధికారుల నివేదిక ఆధారంగా టీఎస్ సర్కార్ చర్యలు తీసుకుంది. ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం...

Warangal : MGM సూపరింటెండెంట్ బదిలీ.. ఇధ్దరు వైద్యుల సస్పెన్షన్

Warangal Mgm

Warangal MGM : వరంగల్ లో ప్రముఖ ఆసుపత్రిగా పేరొందిన MGMలో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మరోసారి నిర్లక్ష్యం బయటపడింది. ఐసీయూలో ఉన్న అపస్మారకస్థితిలో ఉన్న చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికివేశాయి. ఎలుకలు కొరికివేయడంపై సిబ్బందికి ఫిర్యాదు చేసినా… ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. ఘటనకు సంబంధించి 10tv వరుస కథనాలు ప్రసారం చేసింది.

Read More : MGM Hospital : వరంగల్ ఎంజీఎంలో దారుణం.. పేషెంట్‌‌పై ఎలుకల దాడి.. తీవ్ర రక్తస్రావం..!

దీంతో అధికారుల్లో కదిలిక వచ్చింది. మధ్యాహ్నమే ఘటనపై మంత్రి హరీశ్ రావు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అధికారుల నివేదిక ఆధారంగా టీఎస్ సర్కార్ చర్యలు తీసుకుంది. ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. గతంలో సూపరింటెండెంట్ గా ఉన్న చంద్రశేఖర్ కు పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించిన ఇద్దరు వైద్యులను సస్పెన్షన్ చేసింది.

Read More : MGM Medical Scam : వరంగల్ ఎంజీఎంలో మెడికల్ స్కామ్ పై సీఎం సీరియస్, విచారణకు ఆదేశం

అసలేం జరిగింది ?
హన్మకొండ జిల్లా భీమారినికి చెందిన శ్రీనివాస్ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో MGM ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న అతడి కాళ్లు చేతులను ఎలుకలు కొరికివేశాయి. ఆలస్యంగా దీనిని గుర్తించారు. ఎలుకల దాడిలో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితుడి కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎలుకల బెడదపై ఆస్పత్రి ఆర్‌ఎంవో మురళి దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సిబ్బందితో ఆయన ఐసీయూకి వచ్చి పరిశీలించారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు.