Kakinada Love Attack Incident : కాకినాడలో దారుణం.. ప్రేమించడం లేదని యువతిని వెంటాడి హత్య చేసిన ప్రేమోన్మాది

కాకినాడలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని ఓ యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడో ప్రేమోన్మాది. కూరాడ గ్రామంలో స్కూటీపై వస్తున్న యవతిని కత్తితో నరికి చంపేశాడు. ప్రేమించాలంటూ ఏడాదిగా యవతి వెంట పడుతున్నాడు.

Kakinada Love Attack Incident : కాకినాడలో దారుణం.. ప్రేమించడం లేదని యువతిని వెంటాడి హత్య చేసిన ప్రేమోన్మాది

Kakinada Love Attack Incident : కాకినాడలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని ఓ యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడో ప్రేమోన్మాది. కూరాడ గ్రామంలో స్కూటీపై వస్తున్న యవతిని కత్తితో నరికి చంపేశాడు. ప్రేమించాలంటూ ఏడాదిగా యువతి వెంట పడుతున్నాడు.

పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి యువకుడికి వార్నింగ్ కూడా ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లిపోవాలని చెప్పారు. హైదరాబాద్ వెళ్లిపోయిన యువకుడు ఎప్పుడు గ్రామానికి వచ్చాడో తెలియదు. ఒంటరిగా స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించి అటాక్ చేశాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ యువతి పరుగులు పెట్టింది. ఎవరైనా కాపాడతారేమోనని ఆర్తనాదాలు చేసింది. అయినా కనికరం చూపకుండా వెంటాడిన ప్రేమోన్మాది సూర్యనారాయణ ఆమెను కత్తితో నరికి చంపేశాడు.

సూర్యనారాయణ.. ప్రేమ పేరుతో యువతి వెంటబడ్డాడు. ఆమె కాదనడంతో పగ పెంచుకున్నాడు. చివరికి కత్తితో దాడి చేసి యువతిని చంపేశాడు. కాకినాడ రూరల్ పెదపూడి మండలంలోని కూరాడకు చెందిన ఓ యువతిని కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం యువకుడు దారి కాసి ఆమె వస్తుండగా కత్తితో దాడి చేశాడు. అనంతరం పీక కోసి దారుణంగా చంపాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

శనివారం కూరాడ నుంచి కాండ్రేగులకు స్కూటీపై వెళ్తున్న యువతిని వెంబడించిన ఉన్మాది సూర్యనారాయణ.. నడిరోడ్డుపై ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో యువతి కుప్పకూలింది. ఇది చూసిన స్థానికులు 108కు సమాచారమిచ్చారు. తీవ్రంగా గాయపడిన యువతి.. అంబులెన్స్ వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయింది. నేరస్తుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు.

రంగంలోకి దిగిన పెదపూడి పోలీసులు ఆ ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ పేరుతో ఉన్మాదిలా వ్యవహరించిన సూర్యనారాయణను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆ ఉన్మాదిని నడిరోడ్డుపై ఎన్ కౌంటర్ చేయాలన్నారు. ఇలాంటి ప్రేమోన్మాదులను కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉంటాయన్నారు.