Cobra As Murder Weapon : లైఫ్ ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం..పాముకాటుతో కరిపించి చంపేశారు

బీమా సొమ్ము కోసం ఓ నిరుపేదను పాముకాటుతో చంపించిన ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.

Cobra As Murder Weapon : లైఫ్ ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం..పాముకాటుతో కరిపించి చంపేశారు

Maharashtra

Cobra As Murder Weapon  37.5 కోట్ల లైఫ్ ఇన్స్యూరెన్స్  సొమ్ము కోసం మానసిక స్థితి సరిగాలేని ఓ వ్యక్తిని పాముకాటుతో చంపించిన ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.

మహారాష్ట్రకు చెందిన ప్రభాకర్ భీమాజీ వాఘ్‌చౌరే (54) గత 20 యేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నాడు. అతడు అమెరికాలోని ఓ సంస్థ నుంచి 5 మిలియన్ డాలర్ల(రూ. 37.5 కోట్లు) విలువైన బీమా తీసుకున్నాడు. అయితే ప్రభాకర్ 2021లో జనవరిలో ఇండియాకు వచ్చాడు. అహ్మద్‌నగర్ జిల్లాలోని దామన్ గావ్ అనే గ్రామంలో తన అత్తమామల వద్ద నివసించేవాడు.

ఈ క్రమంలో ఏప్రిల్‌ 22న రజుర్‌ పోలీస్‌ స్టేషన్‌కు అక్కడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వాఘ్‌చౌరే అనే వ్యక్తి పాముకాటుతో మరణించినట్లు మరణించినట్లు ఓ రిపోర్ట్ వచ్చింది. దీంతో పోలీసులు ఆ హాస్పిటల్ కు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ సమయంలో మృతుడికి మేనల్లుడిగా చెప్పుకుంటూ ప్రవీణ్‌ అనే వ్యక్తి మరియు హర్షద్‌ లహంజె అనే మరో వ్యక్తి.. మృతుడు వాఘ్‌చౌరే గా గుర్తించినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని మేనల్లుడుగా చెప్పుకున్న ప్రవీణ్‌ అప్పగించారు.

ఆ తర్వాత అమెరికాలో ఉండే వాఘ్‌చౌరే కుమారుడు తన తండ్రి చనిపోయాడంటూ అతని ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం క్లెయిమ్ చేశాడు. అయితే వాఘ్‌చౌరే 2017లో.. భార్య బతికి ఉండగానే అమెరికా ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు సాగించే  ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి బీమా క్లెయిమ్‌ చేశాడు.గతంలో కూడా ప్రభాకర్ తమను మోసం చేసేందుకు యత్నించిన విషయాన్ని గుర్తుచేసుకున్న అమెరికన్ సంస్థ.. ఇన్సురెన్స్ క్లెయిమ్ విషయంలో అనుమానపడింది. క్లెయిమ్‌కు సంబంధించి ధ్రువీకరణ కోసం తమ టీమ్‌ను ఇండియాకు పంపింది. దీంతో ఇండియా చేరుకున్న వారు పోలీసులను సంప్రదించారు. దీంతో విచారణ జరపగా ప్రభాకర్ కుట్ర మొత్తం బయటపడింది.

జీవిత బీమా క్లెయిమ్‌పై దర్యాప్తు చేస్తున్న బీమా సంస్థ అధికారులు ప్రభాకర్ మరణ వివరాలను కోరుతూ అహ్మద్‌నగర్ అధికారులను సంప్రదించడంతో ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. బీమా సంస్థ అధికారులు వాఘ్‌చౌరే ఇంటి పక్కవారిని అడిగితే.. పాముకాటు సంఘటన ఏదీ ఇక్కడ చోటుచేసుకోలేదని,అయితే అంబులెన్స్‌ మాత్రం ఆ ఇంటి ఆవరణలో కనిపించినట్లు తెలిపారు. తర్వాత వాఘ్‌చౌరే మొబైల్‌ కాల్‌ రికార్డులను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అతను బతికి ఉండటమేకాకుండా హాస్పిటల్లో తనను తాను మేనల్లుడు ప్రవీణ్‌గా పరిచయం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గతవారం వాఘ్‌చౌరేను, అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు అహ్మద్‌నగర్‌ ఎస్పీ మనోజ్‌ పటేల్‌ తెలిపారు.

ఈ దర్యాప్తులో చనిపోయిన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన నవ్‌నాథ్‌ యశ్వంత్‌ ఆనప్‌ (50)గా గుర్తించారు. ఏప్రిల్‌ 22న ఆనప్‌ ను బలవంతంగా ముందుగానే నిర్ణయించిన ప్రాంతానికి తరలించి కాలి వేలిపై పాముతో కరిపించారు. అతను మరణించిన తర్వాత మృతదేహాన్ని వాఘ్‌చౌరే ఇంటికి తరలించి, అంబులెన్స్‌ ను పిలిపించినట్లు తేలింది.

ALSO READ Udaipur Teacher : పాక్ గెలిచిందని సంబరాలు చేసుకున్న టీచర్..ఉద్యోగం కోల్పోయింది