Udaipur Teacher : పాక్ గెలిచిందని సంబరాలు చేసుకున్న టీచర్..ఉద్యోగం కోల్పోయింది

పాక్ జట్టు గెలవడంతో ఓ టీచర్ సంబరాలు చేసుకుంది. పాక్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ...పాక్ ఆటగాళ్ల ఫొటోలు పెడుతూ..స్టేటస్ పెట్టారు.

Udaipur Teacher : పాక్ గెలిచిందని సంబరాలు చేసుకున్న టీచర్..ఉద్యోగం కోల్పోయింది

Udaipur Teacher

Pakistan T20 Win : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలైంది. అది కూడా…పాక్ దేశంతో. దీంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నెట్టింట భారత క్రీడాకారులను ట్రోల్ చేస్తున్నారు. అయితే…పాక్ జట్టు గెలవడంతో ఓ టీచర్ సంబరాలు చేసుకుంది. పాక్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ…పాక్ ఆటగాళ్ల ఫొటోలు పెడుతూ..స్టేటస్ పెట్టారు. అంతే ఇంకేముంది. ఈ స్టేటస్ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో చోటు చేసుకుంది.

Read More : DA Hike : ముందే వచ్చేసిన దీపావళి, ఉద్యోగులకు డీఏ పెంపు..ఎంత పెరిగిందో తెలుసా ?

ఉదయ్ పూర్ లో నీర్జా మోదీ అనే ప్రైవేటు స్కూల్ ఉంది. ఈ పాఠశాలలో నఫీసా అత్తారి టీచర్ గా పనిచేస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ – పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ను టీవీలో నఫీసా ఆసక్తికరంగా చూస్తున్నారు. పాక్ జట్టు రాణించడంతో టీమిండియా ఓటమి అంచున చేరుకుంది. పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతే…పాక్ జట్టు గెలుపుతో ఉద్వేగాన్ని ఆపుకోలేక సంబరాలు చేసుకుంది. అక్కడితో ఊరుకోకుండా…తన ఫోన్ లో స్టేటస్ పెట్టారు. మేం గెలిచాం అంటూ పాక్ ఆటగాళ్ల ఫొటోలు పెట్టారు.

Read More : Sania Mirza: పాకిస్తాన్ క్రికెటర్‌ను ‘బావ గారూ..’ అంటున్న భారత్ ఫ్యాన్స్.. సానియా ఫుల్ హ్యాపీ!!

ఇది కాస్తా..స్కూల్ లో చదువుకొనే విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసిపోయింది. అందులో ఒకరు మీరు పాక్ కు మద్దతిస్తున్నారా అంటూ నఫీసాను ప్రశ్నించారు. అవునంటూ..ఆమె సమాధానం చెప్పారు. దీంతో నఫీసా వాట్సాప్ స్టేటస్ స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ అయ్యింది. దీనిపై పాఠశాల యాజమాన్యం స్పందించింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు టెర్మినేషన్ లెటర్ ను నఫీసాకు పంపించారు. ఈ లెటర్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.