JOBS : నవోదయ విద్యాలయ సమితి టీచింగ్ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

JOBS : నవోదయ విద్యాలయ సమితి టీచింగ్ పోస్టుల భర్తీ

Jobs (3)

JOBS : నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) దేశవ్యాప్తంగా టీచింగ్‌ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ తో మొత్తం 1616 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి ప్రిన్సిపల్‌12 ఖాళీలు , పీజీటీ 397 ఖాళీలు, టీజీటీ 683ఖాళీలు, టీజీటీ 343 ఖాళీలు, మిసిలేనియస్‌ కేటగిరీకి చెందిన ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియ181 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ,పర్సనల్‌ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీగా జులై 22, 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/ పరిశీలించగలరు.