NEET UG 2024 : నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

NEET UG 2024 Exam Admit Cards : అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశానికి సంబంధించి పరీక్ష నీట్ యూజీ 2024 అడ్మిట్ కార్డులను విడుదల చేయగా, 24 లక్షల మంది అభ్యర్థులకు మే 5న నిర్వహించనుంది.

NEET UG 2024 : నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

NEET UG 2024 _ Admit Cards Release (Image Credit : Google )

NEET UG 2024 : ప్రముఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ-2024 షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 5, 2024న జరుగనుంది. ఈ నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 557 నగరాలు, భారత్ వెలుపల 14 నగరాల్లో ఉన్న వివిధ కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:20 గంటల వరకు 24 లక్షల మంది అభ్యర్థులకు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది.

జూన్ 14న ఫలితాలు :
నీట్ యూజీ ఫలితాలు జూన్ 14, 2024న ప్రకటించనుంది. అభ్యర్థులు పరీక్ష హాలులో అడ్మిషన్ కోసం అడ్మిట్ కార్డును ఆన్-డిమాండ్ ఉంటుంది. అడ్మిట్ కార్డ్ లేకుండా అభ్యర్థిని పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి సెంటర్ సూపరింటెండెంట్ అనుమతించరు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష ప్రారంభానికి 2 గంటల ముందు సెంటర్ ఓపెన్ అవుతుంది. మధ్యాహ్నం 1:30 తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించనుంది.

మొత్తం 23,81,833 మంది విద్యార్థులు, 10 లక్షల మంది విద్యార్థులు, 13 లక్షల కన్నా ఎక్కువ మంది విద్యార్థినులు నీట్ యూజీ 2024 కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అదనంగా, 24 మంది విద్యార్థులు ‘థర్డ్ జెండర్’ కేటగిరీ కింద రిజిస్టర్ చేసుకున్నారు.

మొత్తం రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులలో 10 లక్షలకు పైగా ఓబీసీ ఎన్‌సీఎల్ వర్గానికి చెందినవారు, 6 లక్షల మంది సాధారణ విద్యార్థులు, 3.5 లక్షల మంది షెడ్యూల్డ్ కులాల (SC) వర్గానికి చెందినవారు, 1.8 లక్షల మంది జనరల్-ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందినవారు, షెడ్యూల్డ్ తెగ (ST) వర్గానికి చెందిన 1.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.

Read Also : CBSE Exam 2024 Results : సీబీఎస్ఈ బోర్డు పరీక్ష 2024 ఫలితాలు.. మేలో ఎప్పుడైనా ప్రకటించే ఛాన్స్!