WAPCOS Recruitment : వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

WAPCOS Recruitment : వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

WAPCOS Recruitment

WAPCOS Recruitment  : భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ (వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఝార్ఖండ్‌ రాష్ట్రం జల్ జీవన్ మిషన్‌లో తాత్కాలిక ప్రాతిపదికన 81 క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఖాళీల వివరాలకు సంబంధించి టీమ్ లీడర్ పోస్టులు: 3, సీనియర్ క్యూసీ ఇంజినీర్/ థర్డ్ పార్టీ క్వాలిటీ మానిటర్ పోస్టులు: 10, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ పోస్టులు: 3, క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్- మెకానికల్/ ఎలక్ట్రికల్ పోస్టులు: 10, క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్- సివిల్ పోస్టులు: 52, కంప్యూటర్ ఆపరేటర్/ జేఎల్‌ఈ పోస్టులు: 3 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అనుభవం, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు ఈ మెయిల్ ఐడీకి అక్టోబర్‌ 8, 2022వ తేదీలోగా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.wapcos.gov.in/ పరిశీలించగలరు.