Wine Shops closed : మందుబాబుల‌కు షాక్‌.. తెలంగాణ‌లో 48 గంట‌ల పాటు మ‌ద్యం దుకాణాలు బంద్‌..

మందుబాబుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం షాకిచ్చింది. 48 గంట‌ల పాటు రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాలు మూత ప‌డ‌నున్నాయి.

Wine Shops closed : మందుబాబుల‌కు షాక్‌.. తెలంగాణ‌లో 48 గంట‌ల పాటు మ‌ద్యం దుకాణాలు బంద్‌..

Wine Shops Closed In Telangana 48 hours from 11 may evening

Updated On : May 8, 2024 / 7:23 PM IST

Wine Shops Closed In Telangana : మండు వేస‌విలో చ‌ల్ల‌ని బీరు తాగి ఎంజాయ్ చేద్దామ‌ని భావిస్తున్న మందుబాబుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం షాకిచ్చింది. 48 గంట‌ల పాటు రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాలు మూత ప‌డ‌నున్నాయి. లోక్‌స‌భ ఎన్నికలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రిగేలా చూసేందుకు రెండు రోజుల పాటు డ్రై డ్రేగా ప్ర‌క‌టించింది. అందులో భాగంగా మ‌ద్యం విక్ర‌యాల‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మే 11న అంటే శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయాల‌ని ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వైన్ షాపుల‌తో పాటు క‌ల్లు కాంపౌండ్‌లు కూడా మూత ప‌డ‌నున్నాయి. అలాగే ఎన్నిక‌ల ఫ‌లితాల రోజైన జూన్ 4న వైన్ షాపులు మూత‌ప‌డ‌నున్నాయి.

Hyderabad Rainfall : 5 గంటల్లో 62 మిల్లీమీటర్ల వర్షపాతం.. హైదరాబాద్‌లో వాన బీభత్సం

పండుగ‌లు, ప‌ర్వ‌దినాలు, ఎన్నికల కౌంటింగ్, పోలింగ్ జరిగినప్పుడు రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే లోక్ సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎలాంటి వివాదాలు, ఘర్షణలకు తావు ఉండకూడదని పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.