Pm Modi Road Show : విజయవాడలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మెగా రోడ్ షో..

కూటమికి మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజలకు అభివాదం చూస్తూ నేతలు ముందుకు సాగారు.

Pm Modi Road Show : విజయవాడలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మెగా రోడ్ షో..

Updated On : May 8, 2024 / 8:00 PM IST

Pm Modi Road Show : విజయవాడలో ఎన్డీయే కూటమి రోడ్ షో లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్ పాల్గొన్నారు. ఒకే వాహనంపై ముగ్గురూ కనిపించి సందడి చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. విజయవాడ బందర్ రోడ్డు జనసంద్రంగా మారింది. పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు 1.8 కిలోమీటర్ల పాటు రోడ్ షోలో ముగ్గురు నేతలు పాల్గొన్నారు. కూటమికి మద్దతుగా బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరికి అభివాదం చూస్తూ నేతలు ముందుకు సాగారు. రోడ్ షోకు ఆరుగురు ఐపీఎస్ లు, 5వేల మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. ప్రతి 50 మీటర్లకు ఓ సీసీ కెమెరాతో నిఘా పెట్టారు.

టీడీపీ నేతలు కేశినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్, బాలసౌరి, సుజనాచౌదరి, గద్దె రామ్మోహన్, బోండా ఉమా, తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య, వసంత కృష్ణ ప్రసాద్, కొలికిపూడి శ్రీనివాసరావు తదితరులు రోడ్ షో లో పాల్గొన్నారు.

 

Also Read : కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారు.. మెగాస్టార్ చిరంజీవిపై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు