Traffic Restrictions: తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల వైపునకు రావద్దు: పోలీసుల సూచన

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల వైపునకు రావద్దని వాహనదారులకు పోలీసులు సూచించారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ రోడ్ల వైపు నుంచి వెళ్లాలని వాహనదారులకు పోలీసులు చెప్పారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ఎన్టీఆర్‌ భవన్‌, అపోలో, ఫిలింనగర్ ప్రాంతాల నుంచి వచ్చే వారు జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు నుంచి రోడ్డు నంబరు36, రోడ్డు నంబరు 45 రూట్లలో వెళ్లాలి. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలూ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి.

Traffic Restrictions: తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల వైపునకు రావద్దు: పోలీసుల సూచన

Traffic Restrictions: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల వైపునకు రావద్దని వాహనదారులకు పోలీసులు సూచించారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ రోడ్ల వైపు నుంచి వెళ్లాలని వాహనదారులకు పోలీసులు చెప్పారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి.

ఎన్టీఆర్‌ భవన్‌, అపోలో, ఫిలింనగర్ ప్రాంతాల నుంచి వచ్చే వారు జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు నుంచి రోడ్డు నంబరు36, రోడ్డు నంబరు 45 రూట్లలో వెళ్లాలి. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలూ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకోనున్న విషయం తెలిసిందే. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఇవాళ జాతీయ పార్టీగా అవతరించనుంది. పార్టీ పేరుతో పాటు పార్టీ నియమావళిలో మౌలిక అంశాలను సవరించనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 1.19 నిమిషాలకు జాతీయ పార్టీ ప్రకటన చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..