వెలుగులు కాదు చీకట్లు : ఎల్ఈడీ లైట్లతో కంటికి ముప్పు

ఎల్.ఈ.డీ. లైట్‌.... వెలుగు ఎక్కువ, విద్యుత్‌ వినియోగం తక్కువ. కరెంట్ బిల్లు ఆదా... ఏళ్ల తరబడి మన్నిక. ఇలా అనేక ప్రయోజనాలతో అందుబాటులోకి వచ్చింది ఎల్‌.ఈ.డీ.

  • Published By: veegamteam ,Published On : October 9, 2019 / 10:49 AM IST
వెలుగులు కాదు చీకట్లు : ఎల్ఈడీ లైట్లతో కంటికి ముప్పు

ఎల్.ఈ.డీ. లైట్‌…. వెలుగు ఎక్కువ, విద్యుత్‌ వినియోగం తక్కువ. కరెంట్ బిల్లు ఆదా… ఏళ్ల తరబడి మన్నిక. ఇలా అనేక ప్రయోజనాలతో అందుబాటులోకి వచ్చింది ఎల్‌.ఈ.డీ.

ఎల్.ఈ.డీ. లైట్‌…. వెలుగు ఎక్కువ, విద్యుత్‌ వినియోగం తక్కువ. కరెంట్ బిల్లు ఆదా… ఏళ్ల తరబడి మన్నిక. ఇలా అనేక ప్రయోజనాలతో అందుబాటులోకి వచ్చింది ఎల్‌.ఈ.డీ. అంతమంచి ఎల్.ఈ.డీ. లైటింగ్‌ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎల్.ఈ.డీ. కాంతి కాలుష్యం శృతిమించి పోతోందని.. ఇది అనారోగ్యాలతోపాటు.. పశువులు, పక్షులకు కూడా శాపంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా… వీధి లైట్స్‌ నుంచి బెడ్‌రూమ్‌ ల్యాంప్స్‌ దాకా అంతటా ఆక్రమించేశాయి ఎల్.ఈ.డీ లైట్లు. సాధారణ దుకాణాల నుంచి.. షాపింగ్ కాంప్లెక్స్, హోటళ్ల దగ్గర ఏర్పాటు చేసే సైన్‌ బోర్డులు చూపు తిప్పుకోనివ్వనంతగా ఉంటాయి. ఈ వెలుగులు మోతాదు మించితే.. ప్రజల బతుకులు చీకటిమయమేనని అధ్యయనాలు చెబుతున్నాయి.

వెలుగుల వెనుకున్న చీకటి కోణాన్ని ఇటీవలే బయటపెట్టింది.. భువనేశ్వర్‌కు చెందిన.. సెంచూరియన్ యూనివర్సీటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మెనేజ్ మెంట్‌కు చెందిన.. సిభా ప్రసాద్ మిశ్రా టీమ్‌. కాంతి కాలుష్యంలో   గ్రేటర్ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా.. రెండు మూడు స్థానాల్లో కోల్ కతా, ఢిల్లీ నిలిచాయి. ఎల్‌.ఈ.డీ.తో ఎక్కువగా వచ్చే వెలుగు విషయం పక్కనపెడితే.. అందులోని బ్లూ లైట్ కొంత ప్రమాదకరం అంటున్నారు కంటి వైద్యులు. ఎల్.ఈ.డీ. లైటింగ్‌తో కళ్లు డ్యామెజ్ అయిన కేసులు తాము చూడలేదంటున్నారు సరోజినిదేవి కంటి ఆస్పత్రి సూపరిండెంట్ రాజలింగం. కానీ.. ఎక్కువ లైటింగ్ వల్ల కళ్ళకు ఇబ్బంది మాత్రం తప్పకుండా ఉంటుందంటుని.. కళ్లలో నుంచి నీరు వస్తుందని డాక్టర్లు అంటున్నారు. సెల్, ల్యాప్ టాప్ వంటి బ్రైట్‌నెస్‌ ఎక్కువగా ఉండే గాడ్జెట్స్ వాడే వారికి కూడా కంటి సమస్యలు వస్తాయంటున్నారు.

2014 నుండి చేసిన స్టడీలో ప్రధాన నగరాల్లో కాంతి తీవ్రత 102శాతం పెరిగిందని సెంచూరియన్ యూనివర్సీటి టీం లెక్కలు వేసింది. నిద్రలేమి, డిప్రెషన్, స్థూల కాయం, షుగర్ వంటి వ్యాదులు వచ్చే అవకాశం  ఉన్నట్లు స్టడీలో తేలింది. కంటి చూపులో స్పష్టత కోల్పోతే.. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ వెలుగులతో పశువులు, పక్షులకు కూడా ప్రాణ సంకటమేని వెల్లడించింది. ఎల్‌.ఈ.డీ. లైటింగ్‌పై అవగాహన లేకుండా వాడితే.. ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఎంత స్థలంలో ఎంత కాంతినిచ్చే లైట్లు వాడాలన్నది తెలుసుకోవాలని సూచిస్తున్నారు.