నరకం చూస్తున్నారు : ట్రాఫిక్ జామ్‌తో జనాల అవస్థలు

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 07:04 AM IST
నరకం చూస్తున్నారు : ట్రాఫిక్ జామ్‌తో జనాల అవస్థలు

హైదరాబాద్: సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు పయనం అయిన జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్లపై నరకం చూస్తున్నారు. ముందుకి వెళ్లలేకి అవస్థలు పడుతున్నారు. రోడ్లపై గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వాహనదారులక పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టోల్ ప్లాజ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. నల్లొండ జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇదే పరిస్థితి. సాధారణంగా 5 గంటల్లో విజయవాడ వెళ్లాల్సిన ప్రయాణం 10గంటలు పట్టే పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.

వరుసగా 5 రోజులు సెలవులు రావడంతో నగరవాసులు పల్లెబాట పట్టారు. బస్సులు, రైళ్ల రద్దీ తట్టుకోలేక సొంత కార్లలో ప్రయాణం చేస్తున్నారు. 2019, జనవరి 12వ తేదీ శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్డుపైకి వచ్చేశాయి. తెల్లవారుజాము నుంచి కార్లతో హైవేలో రష్ నెలకొంది. టోల్ ఫీజు వసూలు చేయడానికి ఒక్కో వాహనానికి 2-3 నిమిషాల సమయం పడుతోంది. దీంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్-విజయవాడ హైవే దిగ్బంధంలో చిక్కుకుంది. టోల్ గేట్ల దగ్గర వాహనాలను ఫ్రీగా వదిలిపెట్టాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.