నా మీదే ఫోకస్ పెట్టినట్లు అనిపించింది.. ప్రపంచంలోనే బెస్ట్ అనిపించుకోవాలనుకున్నా: రవిచంద్రన్

నా మీదే ఫోకస్ పెట్టినట్లు అనిపించింది.. ప్రపంచంలోనే బెస్ట్ అనిపించుకోవాలనుకున్నా: రవిచంద్రన్

RAVICHANDRAN-ASHWIN

Ravichandran Ashwin: ఆస్ట్రేలియా పర్యటనపై రవిచంద్రన్ అశ్విన్ ఇంత ఎఫెక్ట్ చూపిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆస్ట్రేలియా క్రికెట్ ఎక్స్‌పర్ట్‌లు సైతం నోరెళ్లబెట్టేలా ఉన్న పర్‌ఫార్మెన్స్‌కు టెస్టు సిరీస్‌లో ప్రత్యేక గుర్తింపు దక్కింది. రవీంద్ర జడేజా గాయంతో తనను మ్యాచ్ లలోకి తీసుకోవడంతో నాథన్ లయన్ లాగా తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించాడట. అతనికి తెలిసిందే అయినా ఇన్నింగ్స్ సరిచేయడానికి ఎంత కష్టపడ్డాడో తర్వాత గానీ చెప్తున్నాడు.

‘నాథన్ లయన్ కు బౌలింగ్ వేయడానికి ముందు చాలా మందిలో సందేహం ఉంది. పర్యటనలో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో నన్ను తీసుకున్నారు. ఆరు వికెట్లు తీయగలిగా. మ్యాచ్ అయిపోయిన తర్వాత నన్ను లయన్ ను పోల్చడం మొదలుపెట్టారు. మంచి పర్ ఫార్మెనస్ చేయాలని చాలా ప్రయత్నించా. సౌతాంప్టన్ తర్వాత అనుకున్నంత రాణించలేకపోయింది ఆ మ్యాచ్ లోనే.

నాకు అనిపించింది నాపై మైక్రోస్కోప్ రేంజ్ లో ఫోకస్ పెట్టారని. దీన్ని పర్సనల్ గా తీసకున్నా. లయన్ తో పోటీపడి ప్రదర్శన చేయాలనుకున్నా. అంటే స్మిత్ ను ఎదుర్కోవాలని అర్థమైంది. లయన్ ఓ లవ్లీ బౌలర్ అతణ్ని గౌరవిస్తా. కానీ, నా ఫోకస్ వేరేది.

ఆస్ట్రేలియా గడ్డపై స్మిత్ ను అవుట్ చేసిన స్పిన్నర్ లేరు.దాన్ని మార్చాలనుకున్నా. వరల్డ్ లోనే నేను బెస్ట్ అని నిరూపించుకోవాలని ఆడా. సిరీస్ లో బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిందెవరని అడిగితే విరాట్ కోహ్లీతో పోటీపడలేను కాబట్టి.. స్మిత్ తో పోటీపడాలని డిసైడ్ అయ్యా.

చాలా మంది స్మిత్ ను ఎవరు అవుట్ చేస్తారని చర్చించారు కానీ, ఒక్కరు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. అప్పుడే అనుకున్నా. సిరీస్ ముగిసే సమయానికి నా గురించి మాట్లాడుకోవాలని అలాగే చేశా. అని రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు.