Madhavi Latha : అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తున్నది బోగస్ ఓట్లతోనే- మాధవీ లత సంచలన ఆరోపణలు
తాను ఎంపీగా గెలిచి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని మాధవీ లత అన్నారు.

Madhavi Latha Sensational Allegations
Madhavi Latha : హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 40 ఏళ్లుగా ప్రజలకు ఓవైసీ చేసిందేమీ లేదన్నారు మాధవీ లత. అంతేకాదు ఇన్నాళ్లుగా ఓవైసీ దొంగ ఓట్లతో గెలిచి ప్రజలను మోసం చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన విజయానికి కారణం బోగస్ ఓట్లే అని అన్నారు.
అన్ని రంగాల్లో ముందున్న మన దేశ యువత.. హైదరాబాద్ నియోజకవర్గంలో మాత్రం వెనకబడి ఉందని మాధవీ లత వాపోయారు. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీగా గెలిచి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని మాధవీ లత చెప్పారు. తన పొలిటికల్ ఎంట్రీతో ఓవైసీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. 40ఏళ్లు హైదరాబాద్ ఎంపీగా ఉన్న ఓవైసీ గురించి మాట్లాడడం టైం వేస్ట్ అన్నారామె. తాను గెలిస్తే మార్పు తనదైన శైలిలో ఉంటుందన్నారు మాధవీ లత.
Also Read : తెలంగాణలో బీసీల రిజర్వేషన్లకు గండి కొడుతున్నది ఎవరో సీఎం రేవంత్ చెప్పాలి : కిషన్ రెడ్డి