‘మహారాష్ట్ర అర్నబ్‌పై యాక్షన్ ఏమైనా తీసుకుందా..’

‘మహారాష్ట్ర అర్నబ్‌పై యాక్షన్ ఏమైనా తీసుకుందా..’

Arnab Goswami:మహారాష్ట్ర హోం మినిష్టర్ అనిల్ దేశ్‌ముఖ్ శనివారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్నబ్ గోస్వామిపై ఏదైనా యాక్షన్ తీసుకుందా అని ప్రశ్నించారు. బార్క్ హెడ్ పార్తో దాస్ గుప్తాతో 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌ల గురించి జరిపిన చర్చలు చూసి కూడా చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ముంబైలోని ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ.. అటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కేంద్రం నుంచి ఎలా తీసుకోగలిగారని అడిగారు.

‘అర్నబ్ వాట్సప్ చాట్ చూస్తుంటే.. బాలాకోట్ ఎయిర్‍‌స్ట్రైక్ జరగడానికి మూడు రోజుల ముందే అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ను ఇదే అడుగుదామనుకుంటున్నాం. ఘటన జరగడానికి 3రోజుల ముందే ఎలా తెలిసింది. అది కేవలం ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ తో పాటు సెలక్టెడ్ వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది.

దీనిపై స్టేట్ హోం డిపార్ట్‌మెంట్ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. ఇదంతా అఫీషియల్ సీక్రెట్స్ 1923కు వర్తిస్తుందని అన్నారు.

గోస్వామి, దాస్‌గుప్తాలకు లీక్ అయిన చాట్‌లలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ గురించి చర్చ జరిగింది. ఫిబ్రవరి 26న జైషే మొహమ్మద్ ఉగ్రవాద క్యాంప్ పై దాడి ఘటన గురించి తెలిసింది. కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో 40మంది జవాన్ల వీర మరణం తర్వాతే ఈ చర్యలు జరిగాయి.