US Visa Wait Time For Indians: అమెరికా వీసాలు పొందాలంటే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిందే!

ఢిల్లీలోని కార్యాలయం నుంచి.. విజటర్ వీసాలు పొందేందుకు "అపాయింట్మెంట్ వెయిటింగ్ పీరియడ్" ఏకంగా 833 రోజులుగా ఉందని ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. అలాగే, స్టూడెంట్/ఎక్స్‌చేంజ్ విజిటర్ వీసాల కోసం 430 రోజులు, ఇతర నాన్-ఇమ్మిగ్రంట్ వీసాల కోసం 392 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు వివరించింది. ఇక, ముంబైలో విజిటర్ వీసాల వెయిటింగ్ పీరియడ్ 840 రోజులుగా ఉందని చెప్పింది.

US Visa Wait Time For Indians: అమెరికా వీసాలు పొందాలంటే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిందే!

US visa rule

US Visa Wait Time For Indians: అమెరికా వీసాలు పొందడానికి భారత్ నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో భారతీయులు అనుకున్న సమయానికి అమెరికాకు వెళ్లలేరని ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికాలో పర్యటించేందుకు ఇప్పటికే తేదీలను ఖరారు చేసుకున్న వారు కూడా ఆయా సమయానికి వీసాలు పొందలేరని చెప్పింది. ఢిల్లీలోని కార్యాలయం నుంచి.. విజటర్ వీసాలు పొందేందుకు “అపాయింట్మెంట్ వెయిటింగ్ పీరియడ్” ఏకంగా 833 రోజులుగా ఉందని ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. అలాగే, స్టూడెంట్/ఎక్స్‌చేంజ్ విజిటర్ వీసాల కోసం 430 రోజులు, ఇతర నాన్-ఇమ్మిగ్రంట్ వీసాల కోసం 392 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు వివరించింది.

ఇక, ముంబైలో విజిటర్ వీసాల వెయిటింగ్ పీరియడ్ 840 రోజులుగా ఉందని చెప్పింది. స్టూడెంట్/ఎక్స్‌చేంజ్ విజటర్ వీసాల కోసం 430 రోజులు, ఇతర నాన్-ఇమ్మిగ్రంట్ వీసాల కోసం 392 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉందని వివరించింది. ఇక కోల్ కతాలో కార్యాలయం నుంచి విజిటర్ వీసాల కోసం వెయిటింగ్ పీరియడ్ 767 రోజులుగా ఉందని తెలిపింది. స్టూడెంట్/ఎక్స్‌చేంజ్ విజటర్ వీసాల కోసం 444 రోజులు, ఇతర నాన్-ఇమ్మిగ్రంట్ వీసాల కోసం 360 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉందని వివరించింది.

అన్ని కేటగిరీలకు సంబంధించిన వీసాలకు డిమాండ్ భారీగా ఉందని పేర్కొంది. ఢిల్లీతో పాటు చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, ముంబై కార్యాలయాల నుంచి నాన్-ఇమ్మిగ్రంట్ వీసాలకు దరఖాస్తులు చేసుకున్న వారు కూడా అపాయింట్ మెంట్ల కోసం చాలా కాలం పాటు వేచి చూడాల్సిందేనని తెలిపింది. కాగా, బీ1, బీ2 వీసాల జారీకి అపాయింట్ మెంట్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే.

కరోనా వల్ల కలిగిన ఇబ్బందులు, సిబ్బంది కొరత వల్ల ఇప్పటికే అమెరికా వీసా దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ కేటగిరీల కింద వీసాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో కాస్త ఊరట లభించింది. 2022, డిసెంబరు, 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఎఫ్, హెచ్-1, హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్, ఎం, ఓ, పీ, క్యూతో పాటు అకాడమిక్ జే వీసాలకు ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.

“నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”.. https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw