China New Virus : చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. చైనీయుల్లో భయాందోళన

ఈశాన్య చైనాలో వైరస్‌ పంజా విసురుతోంది. జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్న చాంగ్‌చున్ పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు పెట్టేంతగా విస్తరిస్తోంది.

China New Virus : చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. చైనీయుల్లో భయాందోళన

New Virus

new virus in China : చైనాలో అంతా అయోమయం.. ఏం జరుగుతుందో తెలియని గందరగోళం.. బయట అడుగు బయటపెట్టాలంటేనే ..జనం జంకుతున్నారు.. వరుసగా పట్టణాలు.. నగరాలు.. ఆంక్షల ఒడిలోకి వెళ్తున్నాయి. ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. డ్రాగన్‌ కంట్రీలో అసలు ఏం జరుగుతోంది. ప్రపంచమంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో.. చైనాను కుదిపేస్తున్న ఆ వైరస్‌ ఏంటీ.. భారీగా పెరుగుతున్న కేసులు.. కరోనా కొత్త వేరియంట్‌వేనా.. లేక మరో కొత్త వైరస్‌ పుట్టికొచ్చిందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా లెక్కలతో దోబుచులాడుతున్న చైనాలో అసలేం.. జరిగింది. డ్రాగన్‌ను భయపెట్టిస్తున్న ఆ కొత్త వేరియంట్‌ ఏంటీ..

ఈశాన్య చైనాలో వైరస్‌ పంజా విసురుతోంది. జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్న చాంగ్‌చున్ పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు పెట్టేంతగా విస్తరిస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క చాంగ్‌చున్‌లో దాదాపు నాలుగు వందల కేసులు, జిలిన్ ప్రాంతంలోనే 98 కేసులు నమోదయ్యాయి. దీంతో దాదాపు 90 లక్షల మంది నివసిస్తున్న చాంగ్‌చున్ పట్టణ పరిధిలో లాక్‌డౌన్‌ విధించారు.

Locked down in China : చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్..మరోసారి లాక్ డౌన్..స్కూల్స్ మూసివేత

ఈ సిటీలో ప్రస్తుతం లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ మూతపడ్డాయి. రెండు రోజులకు ఒకసారి, ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. కరోనా వైరస్‌ విజృంభించి వుహాన్‌ లాక్‌డౌన్‌ తర్వాత.. ఈ రేంజ్‌లో భారీగా లాక్‌ డౌన్‌ విధించడం ఇదే తొలిసారి.

ఒమిక్రాన్ కేసులే అని చైనా చెబుతున్నా కాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్‌ మీడియాలో కొత్త వేరియంట్‌పై ప్రచారం జరుగుతోంది. అయితే చైనా ఈ వార్తలను ఎడిట్‌ చేస్తోంది. గతంలో కంటే భారీగా కఠన ఆంక్షలు విధించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇంతకముందు కూడా చైనా కఠిన ఆంక్షలు విధించింది. కానీ ఈ స్థాయిలో జరగలేదు. గతంలో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డప్పుడు కూడా జాగ్రత్త పడింది.

WHO Chief: కరోనా మూలాలపై చైనాతో చర్చిస్తున్నామన్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్

కానీ ఇప్పుడు తీసుకుంటున్న చర్యలే అనుమానాలు రేపుతున్నాయి. రోడ్లపైకి జనాన్ని రానివ్వడం లేదు. ఇంటికొకరు రెండ్రోజలకోసారి నిత్యావసరాల కోసం బయటకు రావొచ్చని చెబుతున్నా ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. కొన్నిచోట్ల కరోనా సోకిన వారిని ఒకే చోటకు జంతువులను తరలించినట్లు కూడా చెబుతున్నారు. అయితే చైనా చాలా వార్తలను సెన్సార్ చేస్తుండటంతో .. అసలేం జరుగుతోందన్నది పూర్తిగా బయటకు రావడం లేదు.