Zoom call: సీఈఓ ఆన్ ఫైర్.. జూమ్ కాల్ మాట్లాడుతూనే 900 మంది ఉద్యోగాలు తీసేశాడు!

అప్పులు ఇచ్చి తీసుకునే ఒక వ్యాపార సంస్థను నిర్వహిస్తున్న సీఈఓ దాదాపు 900మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించాడు. సీఈఓ విశాల్ గార్గ్ అనే వ్యక్తి ఒక్క జూమ్ కాల్ మాట్లాడుతూనే కంపెనీలో..

Zoom call: సీఈఓ ఆన్ ఫైర్.. జూమ్ కాల్ మాట్లాడుతూనే 900 మంది ఉద్యోగాలు తీసేశాడు!

Zoom call: కరోనా కాలం… కామన్ పీపుల్ ను తెగ ఇబ్బందులు పెడుతోంది. చిన్న ఉద్యోగులకైతే ఫ్యూచర్ లేకుండా చేస్తోంది. ఇప్పటికే 2 వేవ్ లు.. ప్రపంచాన్ని ఇబ్బంది పెడితే.. ఇప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తోందన్న వార్తలు.. అందర్నీ టెన్షన్ పెడుతున్నాయి. ఈ క్రమంలో.. అమెరికాలోని ఓ సంస్థ సీఈవో తీసుకున్న నిర్ణయం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 900 మంది ఉద్యోగులను రోడ్డున పడేసింది. అది కూడా.. ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయమేం కాదు.. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా లేదు. జస్ట్.. ముడు నిముషాల్లోపే.. అంతా ఫినిష్ చేశాడు ఆ బాస్.

dailymail.co.uk వెబ్ సైట్ లో వచ్చిన స్టోరీ చెప్పిన ప్రకారం.. అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా.. బెటర్.కాం పేరుతో ఓ సంస్థ పని చేస్తోంది. దాని సీఈవో విషాల్ గార్గ్. ఆయన బుధవారం తన ఉద్యోగులతో జూమ్ కాల్ లో మాట్లాడాడు. ఉద్యోగులందరికీ షాక్ కొట్టేలా.. చావు కబురు చల్లగా చెప్పాడు. క్రిస్మస్, న్యూ ఇయర్ తో మరికొన్ని రోజుల్లో హాలిడే సీజన్ మొదలవుతున్న వేళ.. వారి ఫ్యూచర్ ను ఫసక్ చేశాడు. వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నామని చెప్పేశాడు.

“మీరంతా ఓ దురదృష్టకరమైన గ్రూప్ లో ఉన్నారు. మీరు ఇలాంటి వార్త వినాలని కోరుకోరు. ఈ కాల్ లో ఉన్న వారిలో.. చాలామందిని తక్షణమే ఉద్యోగంలోంచి తొలగిస్తున్నా. మార్కెట్లలో చాలా మార్పులు వచ్చాయ్. ఇలాంటి సిచువేషన్ లో ముందుకు వెళ్లడం కష్టంగా ఉంది. ఇలా ఉన్నట్టుండి ఉద్యోగులను తీసేయడం నా కెరీర్ లో ఇది రెండోసారి. ఇలా మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నా. టర్మినేషన్ గురించి హెచ్ఆర్ వాళ్లు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు” అంటూ విషాల్ గార్గ్ ఆ వీడియో కాల్ లో చెప్పాడు. కనీసం ఉద్యోగుల వెర్షన్ కూడా వినకుండా.. విషయం చెప్పేసి.. కాల్ కట్ చేసేశాడు.

చాలా మంది ఉద్యోగులు రోజుకు 2 గంటలకు మించి పనిచేయడం లేదని.. కస్టమర్లు, తోటి ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నారని విషాల్ గార్గ్ భావించాడట. అందుకే.. ఉద్యోగులను తీసేసే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడని.. dailymail.co.uk కథనం తెలిపింది. ఇలా తప్పుడు నిర్ణయాలతో వార్తల్లో ఉండడం గార్గ్ కు ఇదే మొదటిసారి కాదు. తన సంస్థలో పని చేసే వాళ్లలో చాలామంది బద్ధకస్తులని 2020లో సీరియస్ అయ్యాడట. డెయిలీ బీస్ట్ అనే మరో మీడియా సంస్థ ఆగస్ట్ లో చెప్పిన ప్రకారం.. ఆయన తన పార్ట్ నర్ నే తగలబెట్టేస్తానని బెదిరించాడట.

ఇదిలా ఉంటే.. 2016లో ఏర్పాటైన బెటర్.కాం సంస్థ విలువ ప్రస్తుతం 700 కోట్ల డాలర్ల విలువైనదని.. ఈ సంస్థ 2020లో 400 శాతం వృద్ధి సాధించినట్టు గతంలో సీఈవో విషాల్ చెప్పారని.. dailymail.co.uk తెలిపింది. కారణాలు ఏవైనా.. ఇలా ఉన్నట్టుండి 900 మందిని ఉద్యోగం నుంచి ఊడబీకేసిన తీరుతో.. మరోసారి బెటర్.కాం సీఈవో వార్తల్లోకి ఎక్కాడు. ఈ విషయంపై అంతటా విస్మయం వ్యక్తమవుతోంది. కాస్త సమయం ఇచ్చి.. సరిగా పనిచేయని వాళ్లనే తీసేస్తే బాగుండేది కదా.. అన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. మరి.. విషాల్ గార్గ్.. మానవత్వంతో ఆలోచించి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా.. లేదంటే.. ఒక్కసారి డిసైడైతే అంతే.. అంటూ మోనార్కిజాన్ని కొనసాగిస్తాడా.. చూడాల్సిందే.

………………………………….: అఖండ ప్రభంజనం.. నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే!