Excise Constable Sowmya: తీవ్ర విషాదం.. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి.. అత్యాధునిక వైద్యం అందించినా
నిజామాబాద్ జిల్లా మాధవనగర్ దగ్గర గంజాయి బ్యాచ్ కారుతో ఢీకొట్టడంతో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
Excise Constable Sowmya Representative Image (Image Credit To Original Source)
- నిజామాబాద్ లో గంజాయి బ్యాచ్ దాడిలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు
- నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్యం అందించినా దక్కని ప్రాణం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య కన్నుమూత
Excise Constable Sowmya: నిజామాబాద్ కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య కన్నుమూసింది. నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రెండు పక్కల ఆమెకు పక్కటెముకలు విరిగిపోయాయని, ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌమన్యు కాపాడలేకపోయామని నిమ్స్ డాక్టర్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాధవనగర్ దగ్గర గంజాయి బ్యాచ్ దాడిలో సౌమ్య తీవ్రంగా గాయపడింది. గంజాయి బ్యాచ్ ఆమెను కారుతో ఢీకొట్టింది.
గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ లో అత్యాధునిక వైద్యం అందించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి సౌమ్య మృతి చెందింది.
ఇటీవల నిజామాబాద్ నగర శివారులో గంజాయి ముఠా రెచ్చిపోయింది. అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడింది. ఘటన అనంతరం పోలీసులు స్మగ్లర్ల వాహనాన్ని వెంబడించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
కారులో గంజాయి తరలిస్తున్నారు అనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు రంగంలోకి దిగారు. కారుని అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. కారుతో కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టారు. ఈ ఘటనలో సౌమ్యకు తీవ్రంగా గాయపడింది. శరీరంలో పలు భాగాల్లో గాయలయ్యాయి. సౌమ్యను కాపాడేందుకు డాక్టర్లు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అత్యాధునిక వైద్య సేవలు అందించారు. కానీ లాభం లేకపోయింది. సౌమ్య మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
