Musk Ultimatum: ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పిన మస్క్.. అలా చేయకపోతే ఇక ఎవరైనా ఇంటికేనట!

ట్విట్టర్‭ను సొంతం చేసుకున్న రెండు వారాల్లోనే మాస్క్ అనేక మార్పులు చేశారు. కొన్ని కీలక పదవుల్లో ఉన్న వారితో పాటు సగం మంది ఉద్యోగుల్ని తొలగించారు. అలాగే ఇంటి నుంచి పని చేస్తున్న వారిని ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశించారు. వీటికి అనుగుణంగానే పనుల్లో మార్పులతో పాటు, వారికి కల్పించే సౌకర్యాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు

Musk Ultimatum: ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పిన మస్క్.. అలా చేయకపోతే ఇక ఎవరైనా ఇంటికేనట!

Commit to hardcore or leave says Elon Musk to Twitter employees

Musk Ultimatum: ట్విట్టర్‭ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి సంచలన, వివాదాస్పద నిర్ణయాలతో ట్విట్టర్‭ను ఓ కుదుపు కుదిపివేస్తున్న ఎలాన్ మస్క్.. తాజాగా మరో కీలక నిర్ణయంతో ట్విట్టర్ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేశారు. ట్విట్టర్ సంస్థలో పని చేసే ఉద్యోగులు కష్టపడి పని చేసే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని, లేదంటే మూడు నెలల్లో ఉద్యోగానికి రాజీనామా చేయాలని తాజా ఓ మెయిల్ ద్వారా ఈ అల్టిమేటాన్ని జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఉదయం 3:30 గంటలకు వచ్చిన సందేశంలో ‘‘అధిక పని, అధిక ఒత్తిడి, ఎక్కువ సమయం పని ఉంటుంది. చెమటోడ్చి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి’’ అని మస్క్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పత్రంపై ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుందని మస్క్ ఆదేశించారు. ఒకవేళ ఈ ఒప్పందంపై సంతకం చేయకపోతే ఉద్యోగాన్ని వదిలేసుకోవాల్సిందేనని చెప్పారు. అయితే అలా ఉద్యోగాన్ని వదులుకునే వారికి మూడు నెలల వేతనాన్ని ఇవ్వనున్నట్లు మస్క్ ప్రకటించారు.

ఇకపోతే, ట్విట్టర్ ఆదాయంపై మస్క్‭కు ఆందోళన పెరిగింది. ఇదే విషయాన్ని కొద్ద రోజుల క్రితం ఉద్యోగులతో ఆయన పంచుకున్నారు. ఈ విషయాన్ని చెప్తూనే ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇవ్వడంతో పాటు పలు ఆదేశాలు జారీ చేశారు. వారంలో తప్పనిసరిగా 80 గంటలు పని చేయాలని, ఉద్యోగులకు ఆఫీసులో భోజనం ఉండదని, అలాగే ఇంటి నుంచి పని చేసే సౌకర్యం కూడా ఉండదని తేల్చి చెప్పారు. పెద్ద హైడ్రామా అనంతరం ట్విట్టర్‭ను 44 బిలియన్ డాలర్లకు మస్క్ సొంతం చేసుకున్నారు. కాగా, అప్పటికే ట్విట్టర్ 10 శాతం నష్టాలతో కొనసాగుతోంది. దీంతో తనదైన శైలిలో తిరిగి లాభాల్లో పెట్టేందుకు మస్క్ తన ప్రయత్నాలు చేస్తున్నారు.

ట్విట్టర్‭ను సొంతం చేసుకున్న రెండు వారాల్లోనే మాస్క్ అనేక మార్పులు చేశారు. కొన్ని కీలక పదవుల్లో ఉన్న వారితో పాటు సగం మంది ఉద్యోగుల్ని తొలగించారు. అలాగే ఇంటి నుంచి పని చేస్తున్న వారిని ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశించారు. వీటికి అనుగుణంగానే పనుల్లో మార్పులతో పాటు, వారికి కల్పించే సౌకర్యాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ పతనం అంచుకు వెళ్లడాన్ని తాను తోసి పుచ్చలేనని, అయితే శ్రమించి పని చేస్తే దాన్ని తిరిగి గాడిలో పెట్టొచ్చని మస్క్ అంటున్నారు.

Netflix Users : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై సింగిల్ క్లిక్‌తో మీ అకౌంట్లో ఇతరుల డివైజ్‌లను లాగౌట్ చేయొచ్చు!