Kerala to Mecca: 8,600 కి.మీ, 370 రోజులు, 6 దేశాలు.. కేరళ నుంచి మక్కాకు కాలినడకన సాగిన ఓ వ్యక్తి అద్భుతమైన ప్రయాణం

అటు ఇటుగా ఏడాది కాలం పాటు (370 రోజులు), ఆరు దేశాల గుండా ప్రయాణించి ఎట్టకేలకు గత నెలలో మక్కా చేరుకున్నాడు. స్వయానా యూట్యూబర్ అయిన షిహబ్ తన ప్రయాణంలోని విశేషాన్ని ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజెన్లతో పంచుకున్నాడు

Kerala to Mecca: 8,600 కి.మీ, 370 రోజులు, 6 దేశాలు.. కేరళ నుంచి మక్కాకు కాలినడకన సాగిన ఓ వ్యక్తి అద్భుతమైన ప్రయాణం

Shihab Chottur: దైవ దర్శనాల కోసం పాదయాత్రలు కొత్తేం కాదు. కాశీకి కశ్మీర్‭కు ఎంతో మంది కాలినడకన వెళ్తుంటారు. ప్రపంచంలోని ఎన్నో పవిత్రమైన ప్రదేశాలకు భక్తులు ఇలా కాలినడకన వెళ్తుంటారు. అలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర స్థలాల్లో ముస్లింల గమ్యస్థానం మక్కా. సౌది అరేబియా దేశంలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రతి ఏడాది హాజ్ యాత్ర పేరుతో ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. చాలా మంది కాలినడకన అక్కడికి వెళ్తుంటారు. అలా మన దేశం నుంచి వెళ్లిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతడి పేరు షిహబ్ చొత్తురు. కేరళకు చెందిన వ్యక్తి.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌కు ఏఐసీసీ కొత్త ఇన్‌చార్జ్‌లు.. కొత్త కార్యదర్శులుగా మన్సూర్ అలీ ఖాన్, పీసీ విష్ణునాథ్

అటు ఇటుగా ఏడాది కాలం పాటు (370 రోజులు), ఆరు దేశాల గుండా ప్రయాణించి ఎట్టకేలకు గత నెలలో మక్కా చేరుకున్నాడు. స్వయానా యూట్యూబర్ అయిన షిహబ్ తన ప్రయాణంలోని విశేషాన్ని ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజెన్లతో పంచుకున్నాడు. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఇంతకు గత ఏడాది జూన్ 2వ తేదీని కేరళ నుంచి మక్కా యాత్ర ప్రారంభించాడు. ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలను దాటుకుని మే రెండవ వారంలో ఎట్టకేలకు సౌది అరేబియా చేరుకున్నాడు.

Mukesh Ambani : ముఖేశ్ అంబానీ ముద్దుల మనుమరాలి పేరు ఏంటో తెలుసా..?

కేరళ నుంచి ప్రయాణం ప్రారంభించి పాకిస్తాన్ సరిహద్దులోని వాఘాకు చేరగానే కష్టాలు ప్రారంభమయ్యాయి. షిహబ్ అంతర్జాతీయ పాస్‭పోర్ట్ తీసుకోకపోవడంతో పాకిస్తాన్ వర్గాలు అతడిని వాఘా బార్డర్‭లోనే అడ్డుకున్నాయి. అయితే వాఘాలోని ఒక స్కూలు వద్ద నెలల పాటు ఎదురుచూపు అనంతరం ఎట్టకేలకు పాస్‭పోర్ట్ లభించడంతో ఈ యేడాది ఫిబ్రవరిలో ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం నాలుగు నెలలకు సౌది అరేబియా చేరుకున్నాడు షిహబ్.

NCP Working Presidents: సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‭లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన శరద్ పవార్

సౌది అరేబియా చేరుకున్న అనంతరం ఇస్లామిక్ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యం, పవిత్రత కలిగిన మదీనాలో 21 రోజుల పాటు గడిపాడు. ఆ తర్వాత మక్కాకు బయల్దేరాడు. మదీన నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్కాకు కేవలం 9 రోజుల్లో చేరుకున్నాడు. షిహబ్ తల్లి మక్కాకు చెరుకున్న అనంతరం ఇద్దరు కలిసి హాజ్ ప్రార్థనకు హాజరు కానున్నరట.