Black Holes : విశ్వంలో ఇదే తొలిసారి.. మూడు బ్లాక్ హోల్స్ విలీనం..

అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటిదాకా కనివిని ఎరుగని ఖగోళ వింత ఇది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్‌హోల్స్‌) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి.

Black Holes : విశ్వంలో ఇదే తొలిసారి.. మూడు బ్లాక్ హోల్స్ విలీనం..

Black Holes

Updated On : August 27, 2021 / 7:03 PM IST

Black Holes : అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటిదాకా కనివిని ఎరుగని ఖగోళ వింత ఇది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్‌హోల్స్‌) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఇదొక విశేషం అయితే, భారత్‌కు చెందిన ముగ్గురు ఖగోళ పరిశోధకులు ఈ వింతను ఆవిష్కరించడం విశేషం మరో విశేషం.

పాలపుంతలో తాజాగా ఈ మూడు బ్లాక్‌ హోల్స్‌ను గుర్తించారు. ముందుగా జంట బిలాల గమనాన్ని పరిశీలించిన పరిశోధకులు.. మూడో దానితో వాటి విలీనానికి సంబంధించిన పరిశోధనను ‘ఆస్ట్రోనమీ’’ జర్నల్‌లో ప్రచురించారు. ‘’మూడో పాలపుంత(గెలాక్సీ) ఉందనే విషయాన్ని మేం నిర్ధారించాం. ఎన్‌జీసీ7733ఎన్‌.. అనేది ఎన్‌జీసీ7734 గ్రూప్‌లో ఒక భాగం. ఉత్తర భాగం కిందగా ఇవి ఒకదానిని ఒకటి ఆవరించి ఉన్నాయి’’’ అని తెలిపారు.

గెలాక్సీ జంట.. ఎన్‌జీసీ7733ఎన్‌-ఎన్‌జీసీ7734లోని పాలపుంతలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సాధారణంగా కృష్ణబిలాల కలయిక తీవ్రమైన ఒత్తిడి.. శక్తిని కలగజేస్తుంది. అయితే వాటి విలీనం ఒకదానితో ఒకటి కాకుండా.. పక్కనే ఉన్న మూడో భారీ బ్లాక్‌హోల్‌లోకి విలీనం కావడం ద్వారా ఆ ఎనర్జీ అంతగా ప్రభావం చూపలేకపోయిందని వివరించారు.

అల్ట్రా వయొలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ సాయంతో వీటిని వీక్షించగలిగారు. ఈ అధ్యయనం కోసం సౌతాఫ్రికా ఐఆర్‌ఎస్‌ఎఫ్‌, చిలీ వీఎల్‌టీ, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ఎంయూఎస్‌ఈ టెక్నాలజీల సాయం తీసుకున్నారు. అంతేకాదు కృష్ణ బిలాల విలీనానికి సంబంధించిన ప్రకాశవంతమైన యూవీ-హెచ్‌ ఆల్ఫా ఇమేజ్‌లను సైతం విడుదల చేశారు.