wife picture on house : ఈ ముస్లిం దేశం వెరీ స్పెషల్..ప్రతి ఇంటి గోడలపై భార్యల ఫోటోలు..

ఈ ముస్లిం దేశం వెరీ స్పెషల్..ప్రతి ఇంటి గోడలపై భార్యల ఫోటోలుంటాయి. ఆ ఫోటోల పక్కన..

wife picture on house : ఈ ముస్లిం దేశం వెరీ స్పెషల్..ప్రతి ఇంటి గోడలపై భార్యల ఫోటోలు..

Wife Picture On House

brunei people put the wife picture on house wall బ్రూనై. ప్రపంచంలోని అతి సంపన్న దేశాల్లో ఒక్కటి. పసిడితో అలంకరించబడిన అద్భుత ప్రాంగణం కలిగిన దేశం బ్రూనై. అందాలకు కొదవేలేదు. అటువంటి బ్రూనై దేశంలో ఓ వింత ఆచారం ఉంది. దీన్ని ఆచారం అన్నా ఆ దేశ ప్రజలకు వారి అధినేత మీద ఉన్న గౌరవం అనుకున్నా గానీ అది మాత్రం ఓ వింత అనే చెప్పాలి. అదేమంటే ముస్లిం దేశం అయిన బ్రూనైలో ఈ నాటికీ విచిత్రమైన సంప్రదాయాలు కనిస్తాయి. అవి నమ్మశక్యంగా అనిపించకపోయినప్పటికీ అక్కడ కనిపించేవి అవే. ప్రపంచంలోని ధనిక దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందిన బ్రూనైలో దాదాపు ప్రతీ ఇంటి గోడపై ఆ ఇంటి యజమాని భార్య ఫోటో ఉంటుంది. ఈ ఫోటో పక్కనే బ్రూన్ సుల్తాన్ ఫోటో ఉంటుంది. సాధారణంగా ముస్లిం దేశాల్లో వారి ఇంటి స్త్రీలు బయటకు వస్తే ముసుగు తప్పనిసరి. స్త్రీలు ముఖాల్ని కూడా కనిపించనివ్వరు. అటువంటి ముస్లిం దేశంలో వారి ఇంటి గోడలపై భార్యల ఫోటోల్ని పెడతారు. ఆ ఫోటో పక్కనే బ్రూనై దేశాధినేత ఫోటో ఉంటుంది.

Read more : రాజా కుబేరుడా..గోల్డెన్ ప్యాలెస్, 7వేల లగ్జరీ కార్లు, గోల్డ్ కోటింగ్ విమానం..ప్రతీ అంగుళం బంగారమే..

బ్రూనై ప్రజలు శ్రీమంతులు. ఆ దేశంలో ఇళ్లకంటే వారుకుండే కార్లే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. బ్రూనై ప్రజలు విలాసవంతమైన జీవితాలన్ని జీవిస్తారు. ఇళ్ల కంటే ఖరీదైన వాహనాలపైనే మోజు చూపిస్తారు. వీలైనన్ని కార్లను కొంటారు. దీంతో దేశంలో ఇళ్ల కంటే కార్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. బ్రూనైలో ఇప్పటికీ రాజరిక పాలన కొనసాగుతోంది. ప్రపంచంలోని అనేక దేశాల మాదిరిగానే బ్రూనై కూడా బ్రిటిష్ వారి పాలనలో ఉండేది. 1984 జనవరి 1న బ్రూనై స్వాతంత్ర్యాన్ని పొందింది.

ఈ దేశంలో ప్రతీ ఇంటి గోడలపై ఆ ఇంటి యజమాని భార్య ఫోటో ఉంటుంది. పక్కన బ్రూనై సుల్తాన్ ఫోటో ఉంటుంది. ఇక్కడి ప్రజల ఆహార అభిరుచులు మిగతా దేశాలకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లరు. చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం తింటారు. బయటపుడ్ ఎక్కువగా తినరు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ తినేవారు చాలా చాలా తక్కువ. అందుకే బ్రూనైలో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు ఉంటాయి. బ్రూనైలో ప్రతీ 1000 మందిలో 700 మందికి కార్లు ఉన్నాయని ఒక నివేదికలో వెల్లడయ్యింది. ఇక్కడ చమురు ధర చాలా తక్కువ. రవాణా పన్ను కూడా చాలా చాలా తక్కువ.

Read more :  interesting King : ఆ రాజుకు 365 మంది భార్యలు..వారి పేర్లతో 365 లాంతర్లు..విశేషాల రాజు వెనుక చరిత్ర

బ్రూనై సుల్తాన్ ప్రపంచంలోని అత్యంత ధనిక రాజులలో ఒకరిగా ఈనాటికి గుర్తింపుగా పొంది ఉన్నారు. సుల్తాన్ కు ఏడు వేల కార్లు ఉన్నాయంటే అతని సంపదను ఊహించొచ్చు. ఈయన రాజా కుబేరుడా అనిపిస్తుంది. ఆయన ప్యాలెస్ అంతా బంగారమే.7వేల లగ్జరీ కార్లు, గోల్డ్ కోటింగ్ విమానం..ప్రతీ అంగుళం బంగారమే కనిపిస్తుంది. ఆ రాజు వైభోగం చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. అంతా బంగారం మయమే.

బంగారంతో తాపడం చేసిన 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అత్యంత లగ్జరీ ప్యాలెస్,బంగారం పూత పూసిన సొంత విమానం, ఏకంగా 7వేల లగ్జరీ కార్లు ఇంకా బంగారంతో చేసిన వస్తువలకు లెక్కేలేదు. అతని లగ్జరీ గురించి వింటే అతను రాజా లేక అపర కుబేరుడా అనే డౌట్ వచ్చే తీరుతుంది. రాచరికాలు అంతం అయిపోయినా..రాజు స్వయంగా అధికారంలో లేకపోయినా అంతా ఆయన చెప్పుచేతల్లో నడవాల్సిందే…అతనే ‘‘ద గ్రేట్ సుల్తాన్.. బ్రూనై రాజు హస్సనల్ బొల్కియా’’..!!

బ్రూనై రాజు హస్సనల్ బొల్కియా సంపాదన ఊహించటానికే సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో రాచరికం అంతరించిపోయాయి. కానీ ఆ రాజరికపు ఆనవాళ్లు మాత్రం గత చరిత్రను చాటి చెబుతుంటాయి. వాటి రాజసాల గురించి చెబుతుంటాయి. అటువంటి దేశమే బ్రూనై.బూనై రాజు హస్సనల్ బొల్కియా. ఆయన స్వయంగా అధికారంలో లేకపోయినా అంతా ఆయన చెప్పుచేతల్లో నడవాల్సిందే. ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతాయి. చీమ చిటుక్కుమనాలన్నా రాజు అనుమతి ఉండాల్సిందే. బ్రూనైలో సుల్తాన్ గా వ్యవహరిస్తున్న హసనల్ బొల్కియా ఆ దేశానికి రాజు.

Read more :  Viral video : ఛత్తీస్‌గఢ్ సీఎంకు కొరడా దెబ్బలు..దారుణంగా కొట్టిన వైనం

ఆయనకు బంగారం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే తన ప్యాలెస్ ను బంగారంతో తాపడం చేయించుకున్నారు. ఇస్తానా నూరుల్ ఎమాన్ ప్యాలెస్ ను 1984లో చాలా ఇష్టంతో స్వయానా కట్టించుకున్నాడు. ఈ ప్యాలెస్ 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో రాజసంగా బంగారపు రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంటుంది.ఈ ప్యాలెస్ గోపురాన్ని 22 క్యారెట్ల బంగారంతో తాపడం చేయించాడు.ఈ ప్యాలెస్ విలువ రూ. 2,550 కోట్లకు పైమాటే అని నిపుణులు అంచనా వేస్తారు. కానీ అంతకంటే ఎక్కువే ఉంటుందని అంటారు. ఈ ప్యాలెస్ లో 1700 కి పైగా గదులు, 257 బాత్రూంలు, ఐదు స్విమ్మింగ్ పూల్స్, 110 గ్యారేజీలు, గుర్రాలకు ప్రత్యేకంగా 200 ఎయిర్ కండిషన్డ్ గదులున్నాయి. ఈ బంగారపు ప్యాలెస్ ముందు ఓ కొలను ఉంటుంది. ఆ కొలనులో బంగారు రంగులో మెరిసిపోయే ప్యాలెస్ అందాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు…!!

Read more : Latth Maar : ఇదోరకం : డప్పులు వాయించారు.. స్టెప్పులు వేసారు.. కాసేపటికే కర్రలతో కొట్టుకున్నారు..

రాజు హస్సనల్ బొల్కియాకు ఏడు వేల కార్లన్నీ లగ్జరీ కార్లే. ఆ కార్లలో కొన్నింటికి బంగారంతో కోటింగ్ వేయించారు రాజు హాస్సనల్. ఈ కార్ల విలువ సుమారు 341 బిలియన్ డాలర్లు ఉంటుంది. వీటిలో 600 రోల్స్ రాయిస్, 300 ఫెరారీలను ఉన్నాయి…!!రాజు హస్సనల్ బొల్కియా ప్యాలెస్ లో టైనింగ్ టేబుల్, తినే కంచాలు,గిన్నెలు, గ్లాసుల, స్పూన్లు,ఫోర్కులు, ఫ్లవర్ వాజ్ లు, పండుకునే మంచాలు, వేసుకునే బట్టలు, ఆఖరికి బాత్రూమ్ లో బాతింగ్ టబ్ లు కూడా బంగారంతో చేసినవే. సోప్ బాక్సులు, ఇలా ఏది చూసినా బంగారంతో చేసినవే కనిపిస్తాయి.

ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన సుల్తాన్లనో ఒకరిగా రికార్డు క్రియేట్ చేశారు. 1980 వరకు ఆయన ప్రపంచంలో అత్యంత ధనవంతుడు హోదా అనుభవించారు. హసనల్ బొల్కియా కు రూ. 14,700 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.