interesting King : ఆ రాజుకు 365 మంది భార్యలు..వారి పేర్లతో 365 లాంతర్లు..విశేషాల రాజు వెనుక చరిత్ర

అనగనగా ఓ రాజు..ఆరాజుకు ఏడుగురు భార్యలు అని చెప్పుకునేవాళ్లం.కానీ ఓరాజు ఆరాజుకు 365 మంది భార్యలు..వారి పేర్లతో 365 లాంతర్లు..ఏ దీపం ఆరిపోతుందో..ఆ భార్యతో ఆరాజు ఇది కధ కాదునిజం..

interesting King : ఆ రాజుకు 365 మంది భార్యలు..వారి పేర్లతో 365 లాంతర్లు..విశేషాల రాజు వెనుక చరిత్ర

Bhupinder Singh Of Patiala

Updated On : September 27, 2021 / 5:35 PM IST

Bhupinder Singh of Patiala : భారతదేశ చరిత్రలో ఎంతో రాజులు, జమిందార్లు,చక్రవర్తులు. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. కానీ చరిత్రలో ఘనకీర్తిని గడించి చరిత్రలో నిలిచిపోయినవారు మాత్రం అతి తక్కువమందే. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను సంతరించుకున్నావారే. అటువంటి రాజుల్లో పాటియాలాకు చెందిన రాజు ‘మహారాజా భూపిందర్ సింగ్’ ప్రత్యేకతే వేరు అని చెప్పాలి. కేవలం 9 ఏళ్ల వయస్సులో సింహాసనాన్ని అధిష్టించిన చరిత్ర భూపిందర్ సింగ్ ది. నూనూగు మీసాల నూతన యవ్వనంలోనే 18ఏట రాజ్యభారాన్ని స్వీకరించారు. అలా ఆయన 38ఏళ్లకుపైగా రాజ్యాన్ని పాలించిన ‘మహారాజా భూపిందర్ సింగ్’ పేరు చెబితే మరో విశేషం వినిపిస్తుంది.

అదే ఆయన భార్యల సంఖ్య. ఆయనకు ఒకరు ఇద్దరు కాదు లేదా 10 లేక 20మంది కాదు ఏకంగా 365మంది భార్యలు భూపిందర్ సింగ్ కు. ఆ 365మంది భార్యలున్నా కేవలం 10మంది భార్యల ద్వారానే ఆయన 80మందికి పైగా పిల్లలు పుట్టారు. వారిలో 53మంది పిల్లలు మాత్రమే బతికి బట్టకట్టారు. ఇన్నీ ప్రత్యేకతలు కలిగిన ఈ మహారాజా భూపిందర్ సింగ్ గురించి తెలుసుకోలనే ఆసక్తి కలిగి తీరుతుంది కదూ..మరి ఆ సింగ్ గారి భార్యల గురించి..వారితో రాజుగారు ఎలా ఉండేవారో తెలుసుకుందాం..

Maharaja Of Patiala Bhupinder Singh Interesting Facts - 365 रानियों वाला वो 'रंगीन मिजाज' राजा, जिसके थे 50 से ज्यादा बच्चे, दिलचस्प है कहानी - Amar Ujala Hindi News Live
1891 అక్టోబరు 12న జన్మించిన భూపిందర్ సింగ్ తండ్రి మహఆరాజా రాజిందర్ సింగ్ 1900 నవంబర్ 9న మరణించాక తన 9వ ఏటనే సింహాసనాన్ని అలంకరించారు. తన 18 వ ఏట రాజ్య భారాన్నంతా స్వీకరించి 38 ఏళ్ల పాటు రాజ్యపాలన సాగించారని చరిత్ర చెబుతోంది. ఈ రాజు గురించి అనేక విషయాలు ఈనాటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మహారాజా భూపిందర్ సింగ్‌కు 365 మంది రాణులున్నారు.

వీరిలోని 10 మంది రాణుల ద్వారా మాత్రమే 83 మంది సంతానం కలిగారు. అయితే ఈ పిల్లలలో 53 మంది మాత్రమే బతికారు. ఈ రాణులంతా ఎప్పుడూ ఏదోఒక అనారోగ్య సమస్యలతో బాధపడేవారట. రాజు తలచుకుంటే దేనికి కొదువా చెప్పండి. అందుకే ఓ వైద్య బృందం భార్యల కోసం ఎప్పుడు అహర్నిశలు వారి సేవల్లోనే ఉండేవారట. వారికి చిన్న దగ్గు వచ్చినా వైద్యుల బృందం అప్రమత్తమైపోయేవారు.

unknown interesting facts about maharaja of patiala bhupinder singh

365మంది భార్యలు..365 లాంతర్లు..వింత గాథ..
మహారాజా భూపిందర్‌కు 365 మంది భార్యలున్నారని చెప్పుకున్నాం కదూ..వారికి అనారోగ్యం అనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆ బార్యల పేపేర్లతో 365 లాంతరు దీపాలను నిత్యం వెలిగించేవారు. వీటిలో ఏ లాంతరు దీపం ఆరిపోతుందో…మహారాజా భూపిందర్ సింగ్ ఆ రాణితో రాత్రంతా గడిపేవారు. అలా నియమం పెట్టుకున్నారాయన. ఎందుకంటే దీపం ఆరిపోతే ఆరాణి చనిపోతుందని..కాబట్టి ఆ రాణితో ఉంటే ఆమె సంతోషిస్తుందనే కారణంతో..

మహారాజా భూపిందర్ సింగ్ గురించి దివాన్ జరామణి దాస్ తన ‘మహారాజా’ అనే పుస్తకంలో వివరంగా పేర్కొన్నారు. ఈ వివరాల ప్రకారం..భూపిందర్ సింగ్ పాటియాలాలో లీలాభవన్ కట్టించారు. ఈ భవనాన్ని పాటియాలా పట్టణంలో బౌపేరి బాగ్‌కు సమీపంలో భూపేందర్‌నగర్‌కు వెళ్లే రహదారిపై నిర్మించారు. ఈ భవనాన్నే రంగారీస్ అని కూడా అనేవారు. ఈ భవనంలోకి రావాలని ఎవరైనా అనుకుంటే వారు ప్రజలు అయినా కావచ్చు. దుస్తులు లేకుండా మాత్రమే రావాలి. అలా వచ్చేవారికే భవనంలోకి రావడానికి అనుమతి నిచ్చేవారట.

Sir Bhupinder Singh, Maharaja of Patiala , takes in the view from the... News Photo - Getty Images

ఈ ప్యాలెస్‌లో ఒక ప్రత్యేక గదిని ‘ప్రేమ్ మందిర్’ అని పిలుస్తారు. దీనిని మహారాజుకు కేటాయించారు. అంటే అతని అనుమతి లేకుండా మరెవరూ ఆ గదిలోకి ప్రవేశించకూడదు. ఈ గదిలో రాజు ఆనందం కోసం అన్నీ ఏర్పాట్లు ఉంటాయి. అతని ప్యాలెస్ లోపల ఒక పెద్ద చెరువులో ఒకేసారి సుమారు 150 మంది స్నానం చేయడానికి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.

రాజుగారికి విందులు ఇవ్వటం అలవాటు. అలా రాజు ఈభవనంలోనే విందులు ఇచ్చేవారట.ఈ విందుకు తన స్నేహితులు, స్నేహితురాళ్ళను మాత్రమే పిలిచేవారట. అంతేకాకుండా మహారాజాకు చెందిన కొందరు ప్రత్యేక వ్యక్తులు కూడా పార్టీకి పిలిచేవారు. అంటే రాజుగారికి అతి సన్నిహితమైనవారు మాత్రమే ఈ విందులకుపిలిచేవారన్నమాట.

విందులు ఇచ్చే ఈ రాజుగారికి మరో కోరిక కూడా ఉండేది. అదే కార్లు. రాజా భూపిందర్ సింగ్ వద్ద 44 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయని, అందులో 20 కార్లు రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగించేవారని చెబుతారు.ఈ రాజావారు అత్యంత ఖరీదైన కార్లతో పాటు ఓ విమానం కూడా కొన్నారు. భారతదేంలో విమానం కొన్న తొలి రాజుగా భూపిందర్ చరిత్రలో నిలిచిపోయారు. ఈ విమానాన్ని రాజు బ్రిటన్ నుండి 1910 సంవత్సరంలో కొనుగోలు చేశారు. అతను తన విమానం కోసం పాటియాలా వద్ద ఎయిర్‌స్ట్రిప్ కూడా నిర్మించాడు.

Indian royal treasures break records at Christie's auction | NRI Pulse

మహారాజా భూపిందర్ సింగ్ అనేక ఇతర విషయాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందారు. అటువంటి ప్రత్యేకతల్లో ప్రపంచ ప్రఖ్యాత ‘పాటియాలా నెక్లెస్’ ఆయన వద్దే ఉండటం. దీనిని ప్రముఖ ఆభరణాల తయారీదారి కార్టియర్ తయారు చేసిందట. ఈ పాటియాలా నెక్లెస్ లో 2,900కి పైగా వజ్రాలు, విలువైన రత్నాలు పొందుపరిచారట.ప్రపంచంలో ఏడవ అతిపెద్ద వజ్రం ఆ హారంలో ఉంది. ఈ విలువైన నెక్లెస్ 1948 సంవత్సరంలో పాటియాలా రాజ ఖజానా నుండి కనుమరుగైంది. చాలా సంవత్సరాల తరువాత, దాని వివిధ భాగాలు చాలా ప్రదేశాలలో ఉన్నట్లుగా కనుగొన్నారు.

Colors of Rainbow: Blogs of Engr Maqbool Akram: A Fairy Tale Story of A Maharaja Having 365 Queens & More Than 50 Children

భూపిందర్ సింగ్ భార్యల్లో ఒకరై మహారాణి భక్తవర్ కౌర్ 1911 ఢిల్లీ దర్బార్ సందర్భంగా భారతదేశానికి రాణి చక్రవర్తి చేసిన మొదటి పర్యటనకు గుర్తుగా లేడీస్ ఆఫ్ ఇండియా తరపున క్వీన్ మేరీకి అద్భుతమైన నెక్లెస్‌ని బహుకరించారు. కాగా మహారాణి భక్తవర్ కౌర్ రాజుగారికి ఇష్టమైన భార్య. పలు అధికారిక కార్యక్రమాలకు రాజుగారితో కలిసి ఈ రాణికే పాల్గొనేవారు. ఈమె సంగ్రూర్ కు చెందిన సర్దఆర్ బహద్దూర్ సర్దార్ గుర్నామ్ సింగ్ కుమార్తె. రాజును 1908లో వివాహం చేసుకున్నారు.

 

-రాజా భూపిందర్ సింగ్ మరో భార్య..మహారాణి విమలా కౌర్ సాహిబా. ఈమె అసలు పేరు ధన్ కౌర్.

Is Sunil Jakhar The Next CM Of Punjab After Amrinder Singh? Congress Calls MLAs Meet Today Amid Rift In Party

– మహారాజా భూపిందర్ సింగ్ మనుమడే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. మహారాజా సర్ యాదవీంద్ర సింగ్-మహారాణి మోహిందర్ కౌర్ కుమారుడు.

-ఇన్ని ప్రత్యేకతలతో చరిత్రలో నిలిచిపోయిన మహారాజా భూపిందర్ సింగ్ 1938 మార్చి 23న మరణించారు.పుల్కియర్ రాజవంశానికి చెందినవారు. తండ్రి మహారాజా రాజిందర్ సింగ్, తల్లి జాస్మెర్ కౌర్.

-రాజా భూపిందర్ సింగ్ 1917 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాను స్థాపించారు. 1926 నుండి 1931 వరకు ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఛాన్సలర్‌గా పనిచేశారు.

-అతను తన ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించరు. పాటియాలాలో అనేక సామాజిక సంస్కరణలను ప్రవేశపెట్టారు.

-అతని పెద్ద కుమారుడు, మహారాజా యాదవీంద్ర సింగ్.చిన్న కుమారుడు రాజా భలీంద్ర సింగ్. ఇద్దరూ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు.రాజా భలీంద్ర సింగ్, తరువాత భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.