Latth Maar : ఇదోరకం : డప్పులు వాయించారు.. స్టెప్పులు వేసారు.. కాసేపటికే కర్రలతో కొట్టుకున్నారు..

దీపావళి పండుగ సందర్భంగా ఓ గ్రామంలో డప్పులు వాయించారు..స్టెప్పులు వేశారు..కానీ కాసేపటికే కర్రలతో కొట్టుకుంటారు. అదేంటీ అంటే అదో అచారమంటారు.

Latth Maar : ఇదోరకం : డప్పులు వాయించారు.. స్టెప్పులు వేసారు.. కాసేపటికే కర్రలతో కొట్టుకున్నారు..

Latth Maar Diwali Celebrates

Latth Maar Diwali Celebrates  :  దీపావళి పండుగ వచ్చిదంటే దీపాలు వెలిగించుకుని పూజలు చేసుకుని..పిండి వంటలు వండుకుని చక్కగా ముస్తాబై బాణసంచా కాల్చుకుంటాం. కానీ..భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలు. మరెన్నో ఆచారాలు. అటువంటి ఓ వింత ఆచారం ఉత్తర ప్రదేశ్‌లోని జలౌన్‌ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. జలౌన్ గ్రామస్తులు లాత్‌మార్‌ దీపావళిని వేడుకగా జరుపుకుంటారు. ఈ వేడుకలో గ్రామస్తులంతా ఒకచోట చేరి చక్కగా డబ్బులు వాయిస్తారు. ఆ డప్పులకు చక్కగా డ్యాన్సులు వేస్తారు. అలా స్టెప్పులు వేసి హుషారులో తేలిపోతారు. కానీ కాసేపటిలకే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది.

Read more : వింత ఆచారం : చనిపోయినవారి ఎముకల్ని కాల్చి సూప్ చేసుకుని తాగాలి

కర్రలతో కొట్టుకోవటం మొదలుపెడతారు గ్రామస్తులు. అప్పటి దాకా చక్కగా డ్యాన్సులు వేసేవారు కాస్తా కర్రలతో కొట్టుకోవటం మొదలుపెడతారు. అదే అక్కడి లాత్ మార్ వేడక. ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌​ గా మారింది. లాత్ మార్ వేడుకల్లో భాగంగా గ్రామస్తులంతా రెండు గ్రూపులుగా విడిపోయి పెద్ద పెద్ద డప్పుల్ని వాయిస్తారు. ఆ డప్పులకు తగినట్లుగా హుషారుగా స్టెప్పులేశారు. కానీ అంతలోనే కర్రలతో ఒకరిపై ,మరోకరు దాడి చేసుకుంటారు. ఈ కర్రల దాడుల్లో వారు..యువకుల నుంచి 40 ఏళ్ల వయసువారి వరకు రెండు వర్గాలుగా మారిపోయి కొట్టుకుంటుంటే మరి కొందరు పక్కన నిలబడి వేడుక చూస్తుంటారు.

Read more : Tribe Dangerous feat : కడుపు నింపుకోవటానికి ప్రాణాలు పణంగా పెడుతున్న గిరిజనులు

ఈ లాత్‌మార్‌ దీపావళి ఎన్నో ఏళ్లుగా జరుపుకుంటున్నామని ఈ వేడుక పూర్తి అయ్యాక గ్రామస్తులంతా ఒక్కటిగానే కలిసి ఉంటామని ఈ కొట్టుకోవటం కేవలం ఆచారం మాత్రమే తప్ప ఎటువంటి కక్ష ఉండదని జలౌన్‌ గ్రామస్తులు తెలిపారు. ఈ ఆచారం మాకు బుందేల్‌ ఖండ్‌ నుంచి వచ్చిందని తెలిపారు.