Viral video : ఛత్తీస్‌గఢ్ సీఎంకు కొరడా దెబ్బలు..దారుణంగా కొట్టిన వైనం

ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్‌ బఘేల్ ను ఓ వ్యక్తి కొరడా దెబ్బలు కొట్టాడు. ఓ వ్యక్తి సీఎంని ఎనిమిది రౌండ్లు దారుణంగా కొరడాతో కొట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Viral video : ఛత్తీస్‌గఢ్ సీఎంకు కొరడా దెబ్బలు..దారుణంగా కొట్టిన వైనం

Chhattisgarh Cm Bhupesh Baghel Getting Whipped

Chhattisgarh CM Bhupesh Baghel getting whipped : ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయినా ఓ సాధారణ వ్యక్తిలాగా ఓ వ్యక్తి సాక్షాత్తు సీఎంని కొరడా దెబ్బలు కొట్టారు. సీఎం కావాలని కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు. సీఎం కదాని కొరడాతో కొట్టిన వ్యక్తి ఏదో నామ మాత్రంగా కాదు..గట్టిగానే కొట్టాడు. సాక్షాత్తు సీఎం కొరడా దెబ్బలు కొట్టించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ సీఎం కొరడా దెబ్బలు కొట్టించుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే..

ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్‌ బఘేల్ కొరడా దెబ్బలు కొట్టించుకుని వైరల్ గా మారిపోయారు. మరి ఏంటా సంగతో తేల్చుకుందాం..ఛత్తీస్‌గఢ్ లోని దీపావళి పండుగ సందర్భంగా దుర్గ్‌లో ప్రతి ఏడాది గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు.. ఈ పూజల్లో భాగంగా గోవులకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ త‌ర్వాత భ‌క్తులు కొరడాతో కొట్టించుకుంటారు. గోవ‌ర్ధన్ పూజ తర్వాత కొరడా దెబ్బలు తింటే స‌మ‌స్యలు అన్నీ తొలగిపోతాయని ప్రజలు నమ్ముతుంటారు.

Read more : Kuppam : కుప్పంలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు లాక్కుపోయిన గుర్తు తెలియని వ్యక్తులు

దుర్గ్‌లోని జంజిగిరి గ్రామంలో జరిగే గోవ‌ర్ధన్ పూజ‌కు సీఎం భూపేశ్ బఘేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం బీరేంద్ర ఠాకూర్ అనే వ్యక్తితో సీఎం భూపేశ్ బ‌ఘేల్‌ను కొరడాతో కొట్టించుకున్నారు..కొరడా దెబ్బలు తిన్న తరువాత సీఎం మాట్లాడుతూ.. గోవును పూజించే ఈ గోవ‌ర్ధన్ పూజా కార్యాక్రమం చాలా గొప్పసంప్రదాయం అని..భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల‌కు ప్రతిబింభమని అన్నారు. మన సంప్రదాయాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా మనం మన సంప్రదాయాల్ని మన భావి త‌రాల‌కు అందించాలి. అది మన బాధ్యత. ఈ సంప్రదాయంలో భాగంగానే సీఎం కొరడాతో కొట్టించుకున్నారు. ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more : Latth Maar : ఇదోరకం : డప్పులు వాయించారు..స్టెప్పులు వేసారు..కాసేపటికే కర్రలతో కొట్టుకున్నారు..

ఈ వీడియోలో సీఎం భూపేష్ బఘేల్.. తలపాగా..సంప్రదాయ దుస్తులు ధరించారు. సీఎం ఒక చేయి చాచి నిలబడి ఉండగా చేతిపై ఓ వ్యక్తి కొరడాతో కొట్టాడు. ఈ కార్యక్రమం బ్యాగ్రౌండ్‌లో డప్పుల ఓ రేంజ్ లో మోగుతున్నాయి. అలా ఎనిమిది రౌండ్ల కొరడాతో కొట్టిన వ్యక్తి ఆపిన తరువాత సీఎంను కౌగిలించుకున్నాడు.