బైడెన్ గెలిస్తే.. అమెరికా ఉపాధ్యక్షునిగా కమలా హ్యారిస్.. అన్నింట్లో ఆమే మొదటి మహిళ

  • Published By: sreehari ,Published On : November 7, 2020 / 11:24 AM IST
బైడెన్ గెలిస్తే.. అమెరికా ఉపాధ్యక్షునిగా కమలా హ్యారిస్.. అన్నింట్లో ఆమే మొదటి మహిళ

Kamala Harris : అమెరికా అధ్యక్ష పదవి రేసులో జో బైడెన్‌ దూసుకెళ్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో జో బైడెన్ గెలుపు లాంఛనమే అన్నట్టుగా కనిపిస్తోంది. హోరాహోరీ పోరులో ట్రంప్‌కు బలమైన ప్రత్యర్థిగా నిలిచిన బైడెన్.. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో ఆయనే పైచేయి సాధించారు.



బైడెన్ అధ్యక్ష పదవి రేసులో దూసుకెళ్తుంటే.. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీచేస్తున్నారు. అధ్యక్షుడిగా బైడెన్ గెలిస్తే చాలు.. ఇక ఉపాధ్యక్ష పదవి కమలాకు వరించినట్టే..Kamala అంతేకాదు.. బైడెన్ అధ్యక్షుడైతే.. కమల హ్యారిస్.. మొదటి మహిళ, మొదటి భారతీయ అమెరికన్, మొదటి నల్లజాతి, మొదటి దక్షిణాసియా అమెరికన్ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన మొదటి ఏషియన్‌గా అవతరించనున్నారు.



ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా బైడెన్ ప్రకటించారు. తల్లి ఇండియన్.. తండ్రి ఆఫ్రికన్ (జమైకా) కావడంతో.. రెండు దేశాల సంప్రదాయాలు కమలా హ్యారిస్‌లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంటాయి.

కాలిఫోర్నియాలో ఇండో ఆఫ్రికన్ అమెరికన్‌గా పుట్టిన కమలా హ్యారిస్.. డెమొక్రటిక్ పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు.



బైడెన్ తనను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడాన్ని హ్యారిస్ స్వాగతించారు. అంతేకాదు.. బైడెన్ తనను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో..  కమల.. చితిస్ (తమిళంలో పిన్నమ్మలు) అంటూ వ్యాఖ్యానించడంతో ఆమె అనేక భారతీయ అమెరికన్లకు మరింత చేరువయ్యారు.

చాలావరకు నియోజకవర్గాల్లో ఆఫ్రికన్ అమెరికన్లు, ఆసియా అమెరికన్లు, దక్షిణాసియా అమెరికన్లు అధిక సంఖ్యలో ఉన్నారు.Kamala 4.5 మిలియన్ల మంది భారతీయ అమెరికన్లు ఉండగా వీరిలో 1.9 మిలియన్ల మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. జార్జియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ మిత్రపక్షమైన రిపబ్లికన్ సెనేటర్ డేవిడ్ పెర్డ్యూ కమల హ్యారిస్ పేరును అపహాస్యం చేశారు. ఆమె పేరును తప్పుగా ఉచ్చరించే ప్రయత్నం చేశారు.



కానీ, బైడెన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలను ప్రకటించడంతో భారతీయ అమెరికన్లలో ముఖ్యంగా డెమోక్రాట్లను సమీకరించారు. ఇప్పుడు అదే హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి ఓటు వేసేందుకు భారతీయ అమెరికన్లలో ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇచ్చింది.
Kamala చెన్నై నుంచి అమెరికాకు వచ్చి క్యాన్సర్ పరిశోధకురాలిగా స్థిరపడిన తన తల్లి శ్యామల గోపాలన్ గురించి హ్యారిస్ ప్రస్తావించారు. ఈ రాత్రి తాను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. కానీ తన తల్లి తనను పైనుండి చూస్తుందని తెలుసనని డెమొక్రాటిక్ పార్టీ సమావేశంలో ఉపాధ్యక్ష నామినీగా నామినేషన్ వేసినప్పుడు తెలిపారు.



యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షుడిగా నా నామినేషన్‌ను అంగీకరిస్తున్నానని హ్యారిస్ అన్నారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో పబ్లిక్ అటార్నీగా తన వృత్తిని ప్రభుత్వ కార్యాలయంలో ప్రారంభించారు. కాలిఫోర్నియా నుంచి 2016లో యుఎస్ సెనేట్‌కు ఎన్నికైన కమల ఇప్పుడు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

తల్లి శ్యామలా గోపాలన్‌తో కలిసి హ్యారిస్ చాలాసార్లు చెన్నైకి వచ్చారు. అమెరికా ఎన్నికల్లో కమలా విజయం కోసం తమిళనాడులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.