భూమి ఒరిజినల్ పేపర్లకు బదులు ఎవరైనా జిరాక్స్ పేపర్లు ఇస్తారా?: మంత్రి బొత్స

పవన్, చంద్రబాబు అక్రోశంతో మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు.

భూమి ఒరిజినల్ పేపర్లకు బదులు ఎవరైనా జిరాక్స్ పేపర్లు ఇస్తారా?: మంత్రి బొత్స

ఎన్నికల వేళ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌‌పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల తరువాత మళ్లీ ఈ ప్రచారాన్ని పక్కన పెట్టేస్తారని చెప్పారు.

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌‌ ఇంకా కోర్టులోనే ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు ఈ చట్టం గురించి ఏమీ తెలుసని నిలదీశారు. అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. భూమి ఒరిజినల్ పేపర్లకు బదులు ఎవరైనా జిరాక్స్ పేపర్లు ఇస్తారా? అని అన్నారు. పవన్ ఊగి పోతూ మాట్లాడం కాదని అన్నీ తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు.

పవన్, చంద్రబాబు అక్రోశంతో మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎన్నికల వేళ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అలాగే, పట్టాదారు పాస్ పుస్తకాలు మీద సీఎం జగన్ బొమ్మ వేశారని అంటున్నారని చెప్పారు.

గతంలో ఎన్టీఆర్ బొమ్మను మరుగుదొడ్ల మీద చంద్రబాబు వేయించారని తెలిపారు. అంత మాత్రాన మరుగు దొడ్లు ఎన్టీఆర్ సొంత మవుతాయా? అని అన్నారు. వివాదాలను తగ్గించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకు వస్తున్నామని స్పష్టం చేశారు.

Also Read: కేటీఆర్.. కారు కరాబైంది ఇక రాదు.. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది : సీఎం రేవంత్ రెడ్డి